ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్‌ చేసే యోగాసనం ఏదో తెలుసా? | Vasisthasana, Also Known as Side Plank Pose: How to Do It and Its Benefits | Sakshi
Sakshi News home page

Yoga: ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్‌ చేసే యోగాసనం ఏదో తెలుసా?

May 3 2025 1:31 PM | Updated on May 3 2025 2:52 PM

Yoga Vasisthasana How to Do and Benefits

 సైడ్‌ ప్లాంక్‌ పోజ్‌ 

వశిష్ఠాసనాన్నిసైడ్‌ ప్లాంక్‌ పోజ్‌ అని కూడా అంటారు. ఇది అథ్లెటిక్స్‌ చేసే వ్యాయామాలను  పోలి ఉంటుంది. కాబట్టి శరీరానికి తగినంత చురుకుదనం లభిస్తుంది. శరీర బరువు బ్యాలెన్స్‌ను సరిచూసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగ పడుతుంది.

ఎలా చేయాలంటే...

  • మ్యాట్‌ పైన పడుకొని ఎడమచేతి వైపు తిరగాలి. తర్వాత ఎడమపాదం నుంచి కుడిమోకాలిని వంచి, ఎడమ చేతిని నేలకు ఆనించి శరీరాన్ని పైకి లేపాలి. 

  • బరువు మొత్తం చేతి మీద వేయడం సాధ్యం కాని వాళ్లు మోచేతి వరకు ఉంచాలి. 

  • కుడిచేతిని కుడి తుంటిపై ఉంచాలి. బరువు మొత్తం ఎడమ పాదం, ఎడమ చేతిపైనే ఉంటుంది కాబట్టి

  • బాడీని బ్యాలెన్స్‌ చేయడం తప్పనిసరి. ∙తుంటి భాగాన్ని వీలైనంత పైకి ఎత్తి,  కుడిమడమ నుండి తల వరకు శరీరాన్ని ఒక సరళ రేఖలోఉంచేలా దృష్టి పెట్టాలి. 

  • కనీసం 5 దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ, వదిలి ఉండగలగాలి.

  • తర్వాత యధాస్థితికి వచ్చి, తిరిగి కుడివైపు ఇదే విధంగా చేయాలి. 

ప్రయోజనాలు... 
ఈ ఆసనం ద్వారా శక్తిస్థాయులు పెరుగుతాయి. కండరాలు, వెన్నుముక సమస్యలు తగ్గి బలం పెరుగుతుంది. శరీరానికి, మైండ్‌కి, కండరాలకు సమతుల్యత నిస్తుంది. ఛాతీ, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. 

ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..!
 

Advertisement
 
Advertisement
Advertisement