
అత్యవసర ఆరోగ్యరక్షణపై అవగాహన
గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్ నిర్వహణ
అత్యవసర ఆరోగ్య సంరక్షణ, ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు హోండా బిగ్‌వింగ్ డీలర్ షిప్‌లు, ఆటోఫిన్ హోండా, జేఎస్‌పీ హోండా, ఫార్చ్యూన్ హోండా బిగ్‌వింగ్ సంయుక్తంగా 10కే రన్ విజయవంతంగా నిర్వహించారు. గచ్చిబౌలిస్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్నర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఫార్చ్యూన్ హోండా నీరవ్‌మోడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ అత్యవసర ఆరోగ్య సంసరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హోండా బిగ్‌వింగ్ ప్రయత్నంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశామన్నారు. దీనిని యేటా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను మొత్తం ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
హైటెక్‌సిటీలో 5 కె రన్.. మాదాపూర్ : ఐటీ ఉద్యోగులు 5 కె రన్‌లో పలువురు రన్నర్లు ఉత్సహంగా పాల్గొన్నారు. మాదాపూర్‌లోని
హైటెక్‌సిటీ యశోధహస్పిటల్ వద్ద ఆదివారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 5 కె రన్ నిర్వహించారు. టీసీఎస్ ఉద్యోగులు 8500 మంది పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రముఖ డాక్టర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినవ్, టీసీఎస్ అధ్యక్షుడు వి.రాజన్న, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.