టీబీ రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ పోషకాహార కిట్లు.. | Granules India Limited Nutritional Kits To TB Patients | Sakshi
Sakshi News home page

టీబీ రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ పోషకాహార కిట్లు..

May 14 2025 10:46 AM | Updated on May 14 2025 10:46 AM

Granules India Limited Nutritional Kits To TB Patients

ప్రముఖ ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది క్షయ (టీబీ) రోగులకు మద్దతు ఇవ్వడానికి ఈరోజు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, టీబీ రోగులకు ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను అందించనుంది 

ఈ  ప్రాజెక్ట్ పరిధిలో భాగంగా మొత్తం 6,180 కిట్లను పంపిణీ చేయనుంది. ప్రతి పోషకాహార కిట్‌లో బియ్యం, చిరు ధాన్యాలు, వంట నూనె , వేరుశనగల, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ కార్యక్రమం,  2025 నాటికి టీబీని నిర్మూలించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ కార్యక్రమమైన  ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగం.  

భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద నిక్షయ్ మిత్రగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నమోదయ్యింది. ఈ ప్రాజెక్ట్,  అక్షయ పాత్ర ఫౌండేషన్‌ మద్దతుతో నిర్వహించబడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక క్షయవ్యాధి భారత్‌లోనే ఉండటం బాధకరం 

ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి బాధితులలో దాదాపు 27% ఇక్కడే వున్నారు. గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం.. 2022లో భారతదేశంలో 2.82 మిలియన్ల కొత్త టిబి కేసులు నమోదయ్యాయి. వాటిలో దాదాపు 3 లక్షలకు పైగా మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించాయని అంచనా.

చివరగా ప్రారంభోత్సవ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో జరిగింది, దీనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ జితేష్ వి పాటిల్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి హాజరయ్యారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ ఉమా చిగురుపాటి మాట్లాడుతూ.. "మంచి ఆరోగ్యమనేది  కేవలం ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, సంపన్నమైన , ఉత్పాదక సమాజానికి పునాది అని విశ్వసిస్తున్నాం. 

ఈ కార్యక్రమం ద్వారా టీబీ రోగులకు అవసరమైన పోష్టికాహార మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. ఈ వ్యాధి బారి నుంచి కోలుకునే ప్రయాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు తోడ్పడటం తోపాటు 2025 నాటికి భారతదేశంలో  టీబీని నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యంలో మా వంతు  పాత్ర పోషిస్తుండటం గర్వకారణంగా వుంది" అని అన్నారు.

(చదవండి: Meghan Markle: నటి మేఘన్‌ మార్కెల్‌ పేరెంటింగ్‌ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement