Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu
ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు

సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్‌ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం​ లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్‌ క్యాంపెన్‌ చేశారు. జగన్‌ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం​ లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్‌ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

KSR Comments On TDP Attacks In Elections
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ

ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్‌ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్‌సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్‌సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్‌సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

AP Elections 2024: May 17th Politics Latest News Updates In Telugu
May 17th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 17th AP Elections 2024 News Political Updates02:09 PM, May 17th, 2024విశాఖ జిల్లా: ఎన్నికల ఫలితాలకు ముందే చేతులెత్తేసిన టీడీపీవిశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై గండి బాబ్జి జోస్యంగండి బాబ్జి జోస్యంతో కంగుతిన్న టీడీపీ శ్రేణులువిశాఖ జిల్లాలో పార్టీ ఓడిపోతుందిబీజేపీ పోటీ చేసిన విశాఖ నార్త్ నియోజక వర్గ ఫలితంపై నాకు డౌట్ ఉందిగెలుపుపై అనుమానం వ్యక్తం చేసిన గండి బాబ్జిజిల్లా పార్టీ అధ్యక్షుడే పార్టీ ఓడిపోతుందని మాట్లాడటంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన01:53 PM, May 17th, 2024మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డిసాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉందిమాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదుప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాంపొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉందిమాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవుప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదువివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా?సీఎం జగన్‌ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారుటీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారుటీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగిందివారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారుఇప్పుడు వాళ్ళనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుందిఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందు ఉన్నారుపోలింగ్‌కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారుఅల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లేవీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లేఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్ కు లేఖలు రాస్తున్నారురికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారుతాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారుల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పిందికౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలిటీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుందిప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాంఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావుఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాంకుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాంజగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవుఅందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం11:25 AM, May 17th, 2024విజయనగరం పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద హైడ్రామాఆందోళనకు దిగిన టీడీపీ, ఇండిపెండింట్‌ అభ్యర్థులుజాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌పై ఈసీకి టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుఅభ్యర్థుల ఏజెంట్‌లు లేకుండా తెరిచారని టీడీపీ అభియోగంఅభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చామన్న జేసీవీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు పోలీసుల సమక్షంలో తీశాం11:14 AM, May 17th, 2024తాడిపత్రిలో టీడీపీ దాడులను ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలుతాడిపత్రిలో అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలంజేసీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారువైఎస్సార్‌సీ శ్రేణులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.ఎన్నికల కమిషన్‌ ఎన్డీఏ కమిషన్‌గా మారిపోయింది.ఎస్పీ అమిత్‌, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారుపోలీసుల సహకారంతోనే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులురౌడీషీటర్లను టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లుగా పెట్టారుఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణంతాడిపత్రిలో ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలిఏఎస్పీ రామకృష్ణను కూడా సస్పెండ్‌ చేయాలి 10: 37 AM, May 17th, 2024చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుఏలూరు జిల్లాదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేనిఅధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్‌లో దౌర్జన్యం చేయడంపై 224, 225, 353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు8: 04 AM, May 17th, 2024సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలుగత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులుచంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు8: 01 AM, May 17th, 2024వెల్లివిరిసిన మహిళా చైతన్యంఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికంపోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్‌ శాతం 81.86 శాతంఅసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతంలోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లుదేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ రాష్ట్రంలోనేఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తాం33 చోట్ల 350 స్ట్రాంగ్‌ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలుహింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తాంఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చిందిహింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు715 పోలీస్‌ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాంరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా7: 07 AM, May 17th, 2024టీడీపీ చెప్పినట్లు ఆడినందుకేప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణంరాజకీయ ఒత్తిళ్లతో పోలీస్‌ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలుఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 7: 03 AM, May 17th, 2024నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్రగోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నంఅనంతరం అరవింద్‌బాబు హౌస్‌ అరెస్ట్‌పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్‌ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనంమారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ7: 02 AM, May 17th, 2024పాలన బాగుంటే పోలింగ్‌ పెరుగుతుందిఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం2004లో 69.8 శాతం పోలింగ్‌తో వైఎస్సార్‌కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్‌తో మళ్లీ సీఎంగా వైఎస్సార్‌తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్‌తో అధికారంలోకి టీఆర్‌ఎస్‌2018లో 73.2 శాతం పోలింగ్‌తో మరోసారి సీఎంగా కేసీఆర్‌ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్‌.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్‌ జగన్‌6: 50 AM, May 17th, 2024మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాంపోలింగ్‌ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌2019కి మించి 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంజూన్‌ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాంవిజయవాడలో ఐ–ప్యాక్‌ ప్రతినిధులతో సమావేశం

Slapped Me Kicked In Chest Stomach: Swati Maliwal In FIR  against Bibhav
ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్‌ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తాజాగా స్వాతి మలీవాల్‌ ఆరోపించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్‌ రూమ్‌లో ఉన్న కుమార్‌ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఛాతిపై తన్నాడని, లాగి పడేసినట్లు ఆమె ఆరోపించారు. ఆసమయంలో కేజ్రీవాల్‌ ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు.కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేశారని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన ఉదంతం తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ విషయంలో స్వాతి మలీవాల్‌ పోలీసులకు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిభవ్‌ కుమార్‌ను నిందితుడిగా పేర్కొంటూ గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు.పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆమె వాంగ్మూలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. సివిల్‌ లైన్స్‌లోని మలివాల్ సోమవారం సాయంత్ర ఆరు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా. ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం డ్రాయింగ్‌ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో బిభవ్ కుమార్ గదిలోకి చొరబడి తనను దూషించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు.‘కుమార్‌ నా ముఖంపై ఏడు,ఎనిమిది సార్లు కొట్టాడు. ‘నన్ను వెళ్లనివ్వండి’ అని చెప్పినప్పటికీ ఆయన వదలకుండా ఛాతీ, పొట్ట, సున్నితమైన భాగాలపై పలుమార్లు కొట్టాడు. హిందీలో దుర్భాషలాడాడు. 'నీ సంగతి చూస్తాం’ అంటూ బెదిరించాడు. కడుపులో నొప్పి వస్తుందని, నన్ను వదిలేయాలని వేడుకున్నాను.బిభవ్‌ చర్యలతో పూర్తిగా షాక్‌కు గురయ్యాను. సహయం కోసం గట్టిగా అరిచాను. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని కాలితో తన్ని దూరంగా నెట్టేశాను. నేను బయటక పరుగెడుతుంటే నాపైకి దూసుకొచ్చాడు. నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. ఛాతీ, కడుపు వంటి సున్నితమైన శరీరభాగాలపై పలుమార్లు దాడి చేశాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశా’’ అని స్వాతి మలీవాల్వె‌ ల్లడించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.ఈ ఘటనపై మలీవాల్‌ గురువారం తొలిసారి స్పందిస్తూ.. ఈ దాడితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురయ్యాను పేర్కొన్నారు. 112 నంబర్‌కు కాల్ చేసి సంఘటనను నివేదించానని చెప్పారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Lok Sabha Elections 2024: PM Modi Satires On INDIA Alliance
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ

ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్‌ హ్యాట్రిక్‌ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్‌బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్‌ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్‌లల్లాను టెంట్‌కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్‌ మార్చాలనుకుంది. కాంగ్రెస్‌ వస్తే రామ్‌ లల్లాను మళ్లీ టెంట్‌ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్‌, పవార్‌.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్‌ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్‌ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్‌ అన్నారు. మత నిర్జవ‍్స్త్రన్లకు ల్యాబ్‌గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.

Nagababu Leave Twitter Because Allu Arjun Fans
ట్విటర్‌ నుంచి నాగబాబు ఔట్‌.. వారిద్దరూ వార్నింగ్‌ ఇచ్చారా..?

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కానున్నాడా..? మెగా బ్రదర్స్‌ నాగబాబు, పవన్‌లు ఇద్దరూ బన్నీపై గుర్రుగా ఉన్నారా..? అంటే సోషల్‌ మీడియాలో అవుననే జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, బన్నీ మాత్రం మెగా బంధాలను తెంపుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్లే గుణం అల్లు అర్జున్‌లో ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి బన్నీపై నాగబాబు ఫైర్‌ అవుతున్నారని నెట్టింట వైరల్‌ అయింది. అసలు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడ వచ్చాయి అనేది చూద్దాం. స్నేహితుడి కోసం నిలబడిన అల్లు అర్జున్‌ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్‌ కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన నంద్యాలకు వెళ్లి తన మద్ధతును ప్రకటించారు. ఆ సమయంలో భారీగా బన్నీ ఫ్యాన్స్‌ శిల్పా రవి ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. 2019లో కూడా అల్లు అర్జున్‌ శిల్పా రవికి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒక ట్వీట్‌ వేశాడు. అది అల్లు అర్జున్‌ గురించే అంటూ నెట్టింట వైరల్‌ అయింది.నాగబాబు ట్వీట్‌తో రగడఅల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను నాగబాబు ట్వీట్‌ బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సమయం నుంచి ఈ రచ్చ మొదలైంది. ఆపై, పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే' అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో తమ అభిమాన హీరో గురించే అంటున్నారని బన్నీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు. బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదని వారు తప్పుపట్టారు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేయాల్సిందని నాగబాబును ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. గతంలో జనసేనకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వలేదా అంటూ వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా నాగబాబు అర్ధిక కష్టాల్లో వున్నపుడు 'నా పేరు సూర్య' సినిమాకు ప్రెజెంటర్‌గా తమరి పేరు వేయించి కొంత సాయం అందేలా బన్నీ చేయలేదా..? అంటూ చెప్పుకొస్తున్నారు. చిరంజీవి కూడా తన స్నేహితుల కోసం ఈ ఎన్నికల్లో మద్ధతుగా నిలబడాలని వీడియోలు చేయలేదా అని నెట్టింట బన్నీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు.బన్నీ ఫ్యాన్స్‌, చిరంజీవి వల్లే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా..?వాస్తవానికి బన్నీకి కూడా ఫ్యాన్‌ బేస్‌ భారీగానే ఉంది. తనకంటూ ఒక సపరేట్‌ అభిమానగనాన్ని ఆయన సంపాదించుకున్నారు. వారందరూ సోషల్‌ మీడియా వేదికగా నాగబాబును ఏకిపారేశారు. మరోవైపు చిరంజీవి కూడా నాగబాబు వద్ద బన్నీ విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. ఇంతటితో ఈ వివాదం ఆపాలని ఆయన కోరినట్లు సమాచారం. ఒకవైపు బన్నీ అభిమానుల కామెంట్ల దాడి.. మరోవైపు అన్నయ్య సూచనలు వస్తుండటంతో తన ఎక్స్‌ పేజీని నాగబాబు క్లోజ్‌ చేశారని తెలుస్తోంది.కష్టాన్నే నమ్ముకున్న అల్లు అర్జున్‌అల్లు అర్జున్‌ సినిమా ఇండస్ట్రీలోకి అరవింద్‌ కుమారుడిగా.. మెగాస్టార్‌ మేనళ్లుడిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ రెండో సినిమా నుంచే ఆయన తన కష్టాన్నే నమ్ముకున్నారు. ఒకరకంగా తన స్వయం కృషితో బన్నీ ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్‌గా తనను తాను మలుచుకున్నాడు. పుష్ప సినిమా సమయానికి సుకుమార్‌, బన్నీ ఇద్దరూ టాలీవుడ్‌కే పరిమితం. కానీ, అల్లు అర్జున్‌ తన నటనతో పాన్‌ ఇండియాను మెప్పించాడు. అలా బన్నీ వల్ల సుకుమార్‌ పేరు కూడా దేశవ్యాప్తంగా తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత శక్తివంతమైన ఫ్యాన్‌ బేస్‌ కలిగిన హీరోల్లో అల్లు అర్జున్‌ టాప్‌లో ఉంటారు.

IPL 2024 Playoffs Scenario: RCB May Not Qualify Even If They Beat CSK How
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరదు! అదెలా?

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టేబుల్‌ టాపర్‌గా ముందుగానే టాప్‌-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్‌ రన్‌రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్‌కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్‌కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్‌కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్‌ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్‌కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్‌రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్‌కేను దాటి ప్లే ఆఫ్స్‌ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. ‌చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్‌ రన్‌రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్‌ బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్‌ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్‌

Actor Prabhas Instagram Story Latest Viral
ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్‌ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రావర్ట్ అయిన ఇతడు.. బయటకు కనిపించడం తక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్ స్టాలో అందరూ అవాక్కయ్యేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం? ఏమై ఉండొచ్చు?(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ)'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఊపిరి సలపనంత బిజీగా మారిపోయాడు. గతేడాది 'సలార్'తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్‌కి మరో 40 రోజులు కూడా లేదు. ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ వెయిట్ చేస్తుండగా.. ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు.'డార్లింగ్స్.. ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అని ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది పెళ్లి గురించే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్‌లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కాబట్టి కొత్త మూవీ ప్రమోషన్ లేదా అంటే ఇంకేదైనా అయ్యిండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పేవరకు వెయిట్ అండ్ సీ.(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌)

Air passenger traffic in the country is projected to touch 418 million in the current financial year
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్‌, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్‌ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్‌ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల​్‌గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు.

TV Host Padma Lakshmi Said Please Stop Saying Chai Tea
అలాంటి పదబంధాలను ఉపయోగించొద్దు! నటి పద్మాలక్ష్మి

ఇటీవల మన తెలుగు వాడుక భాషలో ఆంగ్ల పదాలు అలవొకగా చేరిపోయాయి. మనం కూడా వాటికే అలవాటు పడిపోయాం. తెలుగు, ఆంగ్లం మిక్స్‌ కొట్టినట్లుగా మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో కొన్ని అర్థరహితమైన పదబంధాలను వినియోగిస్తున్నాం. వాటినే గుర్తు చేసి అవి ఎంత అర్థ రహితమో వివరిస్తున్నారు భారత సంతతి అమెరికన్‌, రచయిత్రి టీవీ నటి పద్మాలక్ష్మి. తప్పుగా ఉపయోగిస్తున్న గమ్మత్తైన పదబంధాలేంటో చూద్దామా..!చాలామంది 'చాయ్‌ టీ'కి పోదామా అంటుంటారని పద్మాలక్ష్మి చెబుతున్నారు. అస్సలు ఇది ఎంత చెత్త పదబంధమో ఒక్కసారి చూడండంటూ వాటి అర్థం గురించి వివరించారు. నిజానికి చాయ్‌ అంటే టీ మళ్లీ దానికి టీ అనే పదాన్ని కూడా జోడిస్తున్నాం. అంటే టీ టీ అని అర్థం వస్తుంది. అందుకే చాయ్‌ టీ వద్దు. ఆ పదం లేదు. అని సవివరంగా చెప్పారు. అలాగే ఘుమఘమలాడే 'అల్లం టీ' కావాలంటే మసాలా టీ అనండి చాలు అంటున్నారు. అలాగే చాలామంది 'గీ బట్టర్‌' అని అంటారు ఇది కూడా తప్పే ఎందుకంటే.. వెన్న, నెయ్యి వేరువేరు అది గుర్తించుకోండి అని చెబుతున్నారు పద్మాలక్ష్మి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు తాము కూడా విన్న అలాంటి పదబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓ నెటిజన్‌ చాలామంది ఏటీఎం మిషన్‌ అని పిలుస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు పదబంధం. ఏటీఎం అంటేనే(ఆటోమేటెడ్‌ టెల్లర్ ‌మిషన్‌). అలాంటప్పుడు మళ్లా మిషన్‌ ఎందుకు వ్యాఖ్యానించడం అని కామెంట్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టారు. మరో నెటిజన్‌ ఇలాంటి తప్పు పదబంధాలు భారత్‌లోని స్టార్‌బక్స్‌ మెనూలో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అక్కడ ఆహార మెనులో ఇలానే 'చాయ్‌ టీ' ఉండటం విచారకరం అంటూ పోస్ట్‌ పెట్టాడు. (చదవండి: బ్లింకిట్‌ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!)

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement