కేన్స్‌ 2024: బాలీవుడ్‌ హీరోయిన్‌ చేసిన పనికి ఫ్యాన్స్‌ ఫిదా! | Avneet Kaur Touches Ground And Then Her Forehead In Cannes 2024, Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Cannes 2024: కేన్స్‌.. వీడియో షేర్‌ చేసిన నటి.. నువ్వు అసలైన భారతీయురాలివి!

May 25 2024 2:07 PM | Updated on May 25 2024 4:35 PM

Avneet Kaur Touches Ground in Cannes 2024

తన కలలు నెరవేరాయి. ఆమె కష్టాన్ని మనం తప్పకుండా గుర్తించి తీరాల్సిందే.. నేలకు నమస్కరించి తను ఒక అచ్చమైన భారతీయురాలు అని నిరూపించింది అని కామెంట్

భారతీయులు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కలలు నెరవేరినప్పుడు ఎంత సంతోషపడతారో అందుకు తోడ్పడినవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు అంతే ముందుంటారు. ఆ ఆశయాన్ని సాధించడం ఎంతో గౌరవంగా భావిస్తారు. తాజాగా అవనీత్‌ కూడా ఒకింత సంతోషంగా మరింత గర్వంగా ఉంది.

ఎర్ర తివాచీపై వయ్యారంగా..
తొలిసారి ఆమె కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్‌ చలనచిత్రోత్సవాలలో రెడ్‌ కార్పెట్‌పై నడిచింది. మే 23న ఎర్ర తివాచీపై వయ్యారంగా నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ తనకు ఇంత గొప్ప అవకాశం వచ్చినందుకుగానూ నేలకు నమస్కరించి తర్వాత అక్కడ రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోయింది. 

అచ్చమైన భారతీయురాలు
ఇది చూసిన జనాలు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. తన కలలు నెరవేరాయి. ఆమె కష్టాన్ని మనం తప్పకుండా గుర్తించి తీరాల్సిందే.. నేలకు నమస్కరించి తను ఒక అచ్చమైన భారతీయురాలు అని నిరూపించింది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మర్దాని సినిమాతో వెండితెరపై ప్రయాణం మొదలుపెట్టిన అవనీత్‌ బ్రూనీ, ఏక్తా, చిడియాఖన్నా, టికు వెడ్స్‌ షెరు వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె లవ్‌ కీ అరేంజ్‌ మ్యారేజ్, లవ్‌ ఇన్‌ వియత్నాం సినిమాలు చేస్తోంది.

 

 

చదవండి: కేన్స్‌లో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఇండియన్‌ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement