ఐదు విడతల ఓటర్‌ టర్నవుట్‌ డేటా వెల్లడి.. ఈసీ కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

ఐదు విడతల ఓటర్‌ టర్నవుట్‌ డేటా వెల్లడి.. ఈసీ కీలక ప్రకటన

Published Sat, May 25 2024 5:11 PM

Five Phases Voter Turn Out Data Released By Ec

న్యూఢిల్లీ: లోక్‌సభ  ఎన్నికల ఐదు విడతల కచ్చితమైన పోలింగ్‌ ఓటర్‌ టర్నవుట్‌ డేటాను ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం(మే25) వెల్లడించింది. ఓటింగ్‌ శాతాల డేటా అభ్యర్థులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. 

టర్నవుట్‌ డేటా అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగలేదని, ప్రతి విడత పోలింగ్‌ రోజు ఉదయం 9.30నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్‌ డేటాను ఓటర్‌ టర్నవుట్‌  యాప్‌లో ఉంచామని తెలిపింది. పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఈసీ ఖండించింది. 

ఐదు విడతల్లో బూత్‌ల వారిగా పోలింగ్‌ డేటాను వెబ్‌సైట్‌లో ఉంచాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఏడీఆర్‌ వేసిన పిటిషన్‌పై శుక్రవారమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 

అయితే తాము ఈ విషయంలో ప్రస్తుత ఎన్నికల వేళ ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీం తెలిపింది. ఈ విచారణ జరిగిన మరుసటి రోజు ఐదు విడతల్లో పోలైన కచ్చితమైన ఓటర్‌ టర్నవుట్‌ డేటాను  ఈసీ వెల్లడించడం గమనార్హం.

ఈసీ వెల్లడించిన పోలింగ్‌ శాతాలు..

తొలివిడత -   66.14
రెండో విడత- 66.71
మూడో విడత- 65.68
నాలుగో విడత-69.16
ఐదో విడత -   62.20 

Advertisement
 
Advertisement
 
Advertisement