రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్‌ భర్త సక్సెస్ స్టోరీ | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్‌ భర్త సక్సెస్ స్టోరీ

Published Sat, May 25 2024 3:54 PM

Success Story About Tech Billionaire And Co Founder of Micromax Rahul Sharma

'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాతో పరిచయమైనా పరిచమైన 'అసిన్‌' గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ ఈమె భర్త 'రాహుల్ శర్మ' గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈయన ప్రముఖ ప్రారిశ్రామిక వేత్త.. వేలకోట్ల సామ్రాజ్యానికి అధినాయకుడు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ. ఈయన తన స్నేహితులు రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సుమీత్ అరోరాలతో కలిసి 2000లో మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్‌ను స్థాపించారు. ప్రారంభంలో ఇది ఐటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ.. ఆ తరువాత 2008లో మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 210 నాటికి హ్యూ జాక్‌మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే ఫోన్‌లను అందించే సంస్థగా భారతదేశపు అగ్రగామిగా మారింది.

రాహుల్ శర్మ రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత కెనడాలోని సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయం (Saskatchewan University) నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా తీసుకున్నారు.

చదువు పూర్తయిన తరువాత రాహుల్ శర్మ తన తండ్రి నుంచి రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని బిజినెస్ ప్రారంభించారు. ఇప్పుడు ఈయన నికర విలువ ఏకంగా రూ. 1300 కోట్లు. ఈయన మైక్రోమ్యాక్స్‌తో పాటు.. 2017లో భారతదేశపు మొట్టమొదటి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లికార్ప్ ఫౌండర్ కూడా.

రాహుల్ శర్మ 2016లో నటి 'ఆసిన్'ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇప్పుడు అరిన్ రేన్ అనే కుమార్తె ఉంది. వీరు ఢిల్లీలోని ఒక గ్రాండ్ ఫామ్‌హౌస్‌లో నివసిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు సమాచారం. వీరికి బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్ల్యూ ఎక్స్6, మెర్సిడెస్ జీఎల్450, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement