RR Vs SRH: చాహల్‌ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే | IPL 2024 RR Vs SRH Qualifier 2: Yuzvendra Chahal Creates Unwanted Record, See Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2024 RR Vs SRH: చాహల్‌ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే

Published Fri, May 24 2024 11:14 PM

Yuzvendra Chahal Creates UNWANTED Record

రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌  యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును చాహల్‌ నెలకొల్పాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ​క్వాలిఫయర్‌-2లో రెండు సిక్స్‌లు ఇచ్చిన చాహల్‌.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో చాహల్‌ ఇప్పటివరకు  224 సిక్స్‌లు ఇచ్చాడు. 

ఇంతుకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్‌ పీయూష్ చావ్లా(222) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చావ్లాను చాహల్‌ అధిగమించాడు. ఇక కీలక మ్యాచ్‌లో చాహల్‌ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్లు ఏమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.

ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్‌(34) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు సాధించాడు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement