ప్రభాస్‌ తర్వాత బుజ్జిని నడిపిన నాగచైతన్య.. వీడియో వైరల్‌ | Naga Chaitanya Driving Bhairava Bujji After Prabhas, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Naga Chaitanya Drive Bujji Video: ప్రభాస్‌ తర్వాత బుజ్జిని నడిపిన నాగచైతన్య.. వీడియో వైరల్‌

Published Sat, May 25 2024 1:18 PM

Naga Chaitanya Drive Bujji After Prabhas

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'కల్కి 2898'. దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ ఇప్పటికే మొదలయ్యాయి.

కల్కి సినిమాలో భాగంగా  బుజ్జిని ఎప్పుడైతే ప్రభాస్‌ పరిచయం చేశాడో ఆ పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. బుజ్జి, భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ  తాజాగా ఒక కార్యక్రమాన్నే మేకర్స్‌ నిర్వహించారు. బుజ్జి అనే పేరుతో కూడిన వాహనం కూడా కథలో కీలకం. ఆ వాహానాన్ని నడుపుకుంటూ ప్రభాస్‌ మొదటిసారి కనిపించి సందడి చేశాడు. 

అయితే, తాజాగా బుజ్జి వాహనాన్ని అక్కినేని నాగచైతన్య కూడా నడిపాడు. వాహనాన్ని చూసిన నాగచైతన్య ఆశ్చర్యపోయాడు. ఇంజనీరింగ్‌లో ఉన్న రూల్స్‌ అన్నీ బ్రేక్‌ చేస్తూ దీనిని తయారు చేశారా అని ఫన్నీగా కామెంట్‌ చేశాడు. బుజ్జిని డ్రైవ్‌ చేసిన నాగచైతన్య వీడియోను మేకర్స్‌ షేర్‌ చేశారు. సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన కల్కి జూన్‌ 27న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement