జీ-సోనీ డీల్‌ రద్దు.. రూ.748 కోట్లు కట్టాల్సిందే! | Sakshi
Sakshi News home page

జీ-సోనీ డీల్‌ రద్దు.. రూ.748 కోట్లు కట్టాల్సిందే!

Published Sat, May 25 2024 3:32 PM

Zee demands $90 million fee from Sony Group India for calling off deal

విలీన ఒప్పందాన్ని రద్దు చేసినందుకుగాను సోనీ పిక్చర్స్‌ నుంచి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ.748 కోట్లు కోరుతుంది. ఈమేరకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ ప్రకటన విడుదల చేసింది.

2021 డిసెంబర్‌ 22న జీ, సోనీ విలీనానికి ఒప్పందం కుదిరింది. 2023 ఆగస్టు 10న ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం సోనీ గ్రూప్‌ సంస్థలైన కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జెడ్‌ఈఈఎల్‌)తో విలీనానికి ఆమోదం కూడా తెలిపింది. ఇది 10 బిలియన్‌ డాలర్ల విలువైన మీడియా సంస్థ ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే డీల్‌ కుదిరిన రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 22న విలీన ఒప్పందాన్ని సోనీ కార్పొరేషన్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జెడ్‌ఈఈఎల్‌ విలీన షరతులను పాటించడం లేదని తెలిపింది.

ఇన్వెస్టర్లను నమ్మించి చివరకు ఇలా డీల్‌కు రద్దు చేసుకోవడం పట్ల సోనీ నెట్‌వర్క్స్‌ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ) నుంచి 90 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.748.7 కోట్లు) టర్మినేషన్‌ ఫీజును జెడ్‌ఈఈఎల్‌ డిమాండ్‌ చేస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement