సింగర్‌గా పోటీలో దేవయాని కూతురు.. అదిరిపోయే సాంగ్‌తో ఎంట్రీ | Devayani Daughter Iniya Participating In Saregamapa Seniors Season 5, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

స్టేజీపై కూతురి ప్రతిభ.. ఎమోషనల్‌ అయిన దేవయాని

Jun 12 2025 9:11 AM | Updated on Jun 12 2025 10:39 AM

Devayani Daughter Iniya Enter In saregamapa seniors season 5

నటి దేవయాని (50) చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే వెండితెరపై కనిపిస్తున్నారు. 90లలో కథానాయికగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత. ఆమె రాజకుమారన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి ఇనియా సింగర్‌గా రాణించేందుకు తొలి అడుగుపడింది. సౌత్‌ ఇండియాలో పాపులర్‌ పాటల పోటీలో ఆమె బరిలో ఉన్నారు. దీంతో తొలిరోజు తన కూతురిని ఆశీర్వదించి ఆ షోలో దేవయాని కూడా కొంత సమయం పాటు పాల్గొన్నారు.

ముంబైకి చెందిన దేవయాని పెళ్లి తర్వాత చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలోని అన్నా సలైలోని చర్చి పార్క్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, తాజాగా తన కూతురు ఇనియా (21) 'సరిగమప సీనియర్ సీజన్‌-5' రియాలిటీ సింగింగ్ షోలో ఎంట్రీ ఇచ్చింది. జీ తమిళంలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం అక్కడ బాగా పాపులర్‌ అయింది. ప్రతి శనివారం, ఆదివారం సాయింత్రం 7:00 గంటలకు ఈ షో  ప్రసారం అవుతుంది. ఇందులో న్యాయనిర్ణేతలుగా శ్వేత మోహన్‌, టీ రాజేందర్‌, కార్తీక్‌ ఉన్నారు. వేదిక మీద ఇనియా పాడిన పాటకు వారందరూ ఫిదా అయ్యారు. ఆ సమయంలో తన కుమార్తెను చూసుకుని దేవయాని కూడా కాస్త ఎమోషనల్‌ అయ్యారు. వాస్తవంగా ఇనియా వాయిస్‌ చాలా బాగుంది. భవిష్యత్‌లో మంచి సింగర్‌గా ఎదిగే అవకాశాలు మెండుగు ఉన్నాయని కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు.

టాలీవుడ్‌లో సుస్వాగతం సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ,  లవ్‌ స్టోరీ మూవీలో కనిపించారు. ఆమె తెలుగుతో బాటు తమిళ, మలయాళ భాషలలో 75 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. దర్శన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్‌లో ఆమె నటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement