ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్‌రమేశ్‌ | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్‌రమేశ్‌

Published Sat, May 25 2024 9:52 PM

Congress Express Confidence In Winning Loksabha Elections

న్యూఢిల్లీ: ఆరో  విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ కీలక ‍ ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి టార్గెట్‌ 350 సీట్లలో ఇప్పటికే 272 సీట్ల మార్క్‌ దాటామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్‌ రమేశ్‌ అన్నారు. 

ఈ మేరకు శనివారం(మే25) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పరిస్థితి సౌత్‌ మే సాఫ్‌, నార్త్‌ మే హాఫ్‌ అన్నట్లుగా తయారైందన్నారు. దక్షిణాదిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు ఉత్తరాదిలో బీజేపీ సీట్లు గతంతో పోలిస్తే సగానికి తగ్గనున్నాయన్నారు. 

హర్యానా, పంజాబ్‌లలో అయితే బీజేపీ లీడర్లను ప్రచారానికి రాకుండా ప్రజలు తరిమి కొడుతున్నారని చెప్పారు.  బీజేపీ ప్రచారం గడువు కంటే ముందే ముగిసినందున ప్రధాని మోదీ తన రిటైర్‌మెంట్‌ను ప్లాన్‌ చేసుకునేందుకు కావల్సిన సమయం దొరుకుతుందని సెటైర్‌ వేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement