Mamata Banerjee: అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపుతాడా? | Sakshi
Sakshi News home page

Mamata Banerjee: అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపుతాడా?

Published Sat, May 25 2024 5:41 AM

Lok Sabha Election 2024: Mamata Banerjee hits out at PM Modi for his sent by God

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మమత ఎద్దేవా 

కోల్‌కతా: దేవుడు తనను పంపాడని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మథురాపూర్‌లో శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ఓటమి తప్పదనే భయంతో.. ఆ ఫోబియాలో బీజేపీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

 ‘ఇప్పుడాయన తనను తాను దేవుడి బిడ్డగా, మనలాగా ఆయనకు తల్లిదండ్రులు లేరని, భగవంతుడు ఆయన్ను పంపాడని చెప్పుకుంటున్నారు. అల్లర్లను ప్రేరేపించడానికి, ప్రకటనల ద్వా రా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) ద్వారా జనాన్ని జైళ్లో వేయడానికి దేవుడు ఎవరినైనా పంపుతాడా అని నేనడుగుతున్నాను. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా హింసను ప్రోత్సహించడానికి, ఉపాధి హామీ పథకానికి నిధులు ఆపడానికి, పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి దేవుడు తన దూతను పంపుతాడా?’ అని మమత వ్యంగ్యంగా అన్నారు. 

పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమచేస్తాననే హామీపై భగవంతుడు వెనక్కు తగ్గుతాడా అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఒక జాతీయ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. మా అమ్మ బతికున్నంతవరకు నేను సాధారణంగా అందరిలాగే జని్మంచానని అనుకునేవాడిని. ఆమె మరణించాక నా అనుభవాలను పరికించి చూసుకుంటే.. నన్ను దేవుడు పంపాడని నేను నిశి్చతాభిప్రాయానికి వచ్చాను’ అని పే ర్కొన్నారు. ప్రధాని పేరెత్తకుండానే మమత ఆయన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement