గాంధీ-అంబేడ్కర్ అప్పుడేం మాట్లాడుకున్నారో వినాలనుకుంటున్నా : జాన్వీ కపూర్ | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ఒక్క ఇంటర్వ్యూతో వరస షాకులిచ్చిన 'దేవర' హీరోయిన్

Published Sat, May 25 2024 7:13 PM

Janhvi Kapoor Reveals Her Parents Boney Kapoor And Sridevi Secrets

ఒక టైమ్ మెషీన్‌లో మీకు చరిత్రలోకి వెళ్లే అవకాశం కల్పిస్తే మీరేం చేస్తారు? చరిత్రలో ఎక్కడికి వెళ్లాలనుకుంటారు? ఎవరిని చూడాలనుకుంటారు? ఎలాంటి చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలనుకుంటారు? ఇదే ప్రశ్న ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్‌ని ఓ రిపోర్టర్ అడిగాడు. ఆమె సమాధానం విన్న తరువాత ప్రతి ఒక్కరూ షాకయ్యారు. అంతేకాదు ఆలోచనలో పడ్డారు. ఓ మనిషి ముఖం చూసి ఎప్పుడూ వారిని అంచా వేయొద్దని అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‍‌గా పెళ్లి చేసుకున్న ‍'స్ట్రేంజర్ థింగ్స్' నటి)

ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె కొత్త సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' ప్రమోషన్‌లో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. టైమ్ మెషీన్‌లో ప్రయాణం చేసే ఛాన్స్ వస్తే ఎక్కడకు వెళ్తారని యాంకర్ అడగ్గా... తన తల్లి శ్రీదేవిని చూడటానికి వెళ్తాననే సమాధానం ఇస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ జాన్వీ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది.  

తాను చరిత్రలో గాంధీ, అంబేద్కర్ పూనా ఒడంబడికకి ముందు మాట్లాడుకున్న సంభాషణ వినాలనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెప్పింది. చరిత్రలో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో గాంధీ-అంబేద్కర్లు రెండు విభిన్న అభిప్రాయాలతో చేసిన చర్చ తనకు ఎంతో ఇష్టమని.. ఎన్నో చర్చల తర్వాత ఇద్దరు ఓ నిర్ణయానికి రావడం, అది దేశ భవిష్యత్తులో కీలకంగా మారడం తనను ఎంతగానో ప్రభావం చేసిందని జాహ్నవి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)

నిజంగానే ఒక హీరోయిన్ అదీ స్టార్ హీరోయిన్ కూతురు, చరిత్రకు సంబంధించి ఇంతటి జ్ఞానం కలిగి ఉంటుందా అని ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాదు రిజర్వేషన్లు, భారత సమాజం మీద జాన్వీకి ఉన్న అవగాహన చాలామందిని ఆలోచింపజేసింది. ముంబైలాంటి కాస్మోపాలిటన్ సిటీలో పెరిగిన జాన్వీ.. దేశ సామాజిక పరిస్థితుల గురించి ఈ ఇంటర్వ్యూలో చాలా లోతుగా మాట్లాడింది. తాను హిస్టరీ క్లాసులు బంక్ కొట్టి, యుద్ధ సినిమాలు చూసి పరీక్షలు రాసిందో కూడా చెప్పుకొచ్చింది.

నెపోటిజమ్ గురించి కూడా జాహ్నవి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. తాను శ్రీదేవీ, బోనీకపూర్ కూతురు అయినందుకే చాలా ఈజీగా అవకాశాలు వచ్చాయని అయితే వాటిని నిలబెట్టుకునేందుకు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డానని చెప్పింది. తన తండ్రి బోనీకపూర్ శ్రీదేవీని ఎంతలా ప్రేమించారో జాన్వీ చాలా అందంగా వివరించింది. పెళ్లికి ముందు శ్రీదేవీతో బోనీకపూర్ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవారని, చాలాసార్లు శ్రీదేవిని దొంగచాటుగా కలిసేందుకు బాల్కనీ ఎక్కి మరీ వెళ్లేవారని చెప్పుకొచ్చింది.

-ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ

(ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!)

Advertisement
 
Advertisement
 
Advertisement