హార్దిక్‌ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా? | Hardik Pandya Divorce Rumours: Is Pandya 70% Of Property To Be Transferred To Natasa Stankovic? | Sakshi
Sakshi News home page

Hardik-Natasa Divorce Rumours: హార్దిక్‌ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?

Published Sat, May 25 2024 1:53 PM

Hardik Pandya Divorce Rumours: Is Pandya Property To Be Transferred To Natasa Stankovic

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితం గురించి వదంతులు పుట్టుకొస్తున్నాయి. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు తలెత్తాయని.. వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.

నటాషా తన సోషల్‌ మీడియా ఖాతాలలో పాండ్యా ఇంటి పేరును తొలగించిందని.. తద్వారా తాము విడిపోయామని పరోక్షంగా హింటిచ్చిందని ‘రెడిట్’‌ పోస్ట్‌ ద్వారా నెటిజన్లు ఓ అంచనాకు వచ్చారు.

హార్దిక్‌ పాండ్యాను ఎంకరేజ్‌ చేసేందుకు ఐపీఎల్‌-2024 మ్యాచ్‌లకు నటాషా రాలేదని.. అతడితో కలిసి ఉన్న ఫొటోలు కూడా పోస్ట్‌ చేయడం లేదంటూ ఇందుకు కారణాలు వెతికే ప్రయత్నం చేశారు.

వదంతులు మాత్రమేనంటూ
అయితే, ఇవన్ని వట్టి పుకార్లేనని హార్దిక్‌ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌‌గా నియమితుడైన తర్వాత హార్దిక్‌ పాండ్యా దారుణమైన ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే.

పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో అతడిపై విమర్శలు మరింత పదునెక్కాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రభావం భార్య నటాషా, కుమారుడు అగస్త్యపై పడకుండా ఉండేందుకు పాండ్యానే స్వయంగా తనతో ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేయవద్దని భార్యకు సూచించినట్లు తెలుస్తోంది.

అయితే.. ఇన్నాళ్లూ విభేదాలంటూ వార్తలు రాగా..ఈసారి గాసిప్‌ రాయుళ్లు మరో ముందుడుగు వేశారు. హార్దిక్‌ పాండ్యా తీరు నచ్చని నటాషా.. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.

భరణం కింద ఆస్తిలో 70 శాతం
ఈ క్రమంలో భరణం కింద హార్దిక్‌ పాండ్యా ఆస్తి(స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం సుమారు రూ. 91 కోట్లు)లో 70 శాతం మేర(దాదాపు 63 కోట్లు) ఇవ్వాలని కోరిందని.. ఇందుకు అతడు కూడా సుముఖంగానే ఉన్నట్లు నెట్టింట రూమర్లు సృష్టిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు హార్దిక్‌ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.

మరోవైపు.. ఇటీవల నటాషా నుదిటిన బొట్టుతో ఉన్న ఫొటో పోస్ట్‌ చేస్తూ.. ‘‘అతడి ప్రేమ వల్లే ఇలా’’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. దీంతో అభిమానులు పాండ్యాను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ చేసిందని భావిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో విష్‌ చేయని హార్దిక్‌.. ఒంటరిగానే రీచార్జ్‌ అవుతున్నట్లుగా
అయితే, వాలంటైన్స్‌ డే తర్వాత.. నటాషా పుట్టినరోజున సైతం హార్దిక్‌పాండ్యా ఆమెకు విష్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టకపోవడం గమనార్హం. కేవలం కొడుకుతో ఉన్న ఫొటోలు మాత్రమే ఇటీవల పోస్ట్‌ చేసిన హార్దిక్‌.. శుక్రవారం మరో ఫొటోతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రీచార్జ్‌ అవుతున్నా అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. అయితే, ఇందులో నటాషా గానీ, అగస్త్య గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

తదుపరి ఐసీసీ ఈవెంట్లో
మామూలుగా అయితే, ఆట నుంచి విరామం దొరకగానే హార్దిక్‌ పాండ్యా తన భార్య, కుమారుడితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. హార్దిక్‌- నటాషాలలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వదంతులకు చెక్‌ పడదు. 

కాగా హార్దిక్‌ సెర్బియా మోడల్‌ నటాషాను ప్రేమించి 2020లో పెళ్లాడాడు. పెళ్లికి ముందే తల్లిదండ్రులైన వీరు గతేడాది ఘనంగా మరోసారి వివాహం చేసుకున్నారు.  ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా తదుపరి జూన్‌ 1 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌-2024కు సిద్ధం కానున్నాడు. 

చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్‌ప్రైజ్‌.. ఇంకొక్క అడుగు

Advertisement
 
Advertisement
 
Advertisement