వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్‌ విజేత ఎవరంటే? | Sakshi
Sakshi News home page

వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్‌ విజేత ఎవరంటే?

Published Sat, May 25 2024 9:21 PM

What If KKR Vs SRH IPL 2024 Final Is Abandoned Due To Rain

ఐపీఎల్‌-2024 ఫైనల్‌ పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం(మే 26) చెపాక్‌ స్టేడియం వేదికగా ఈ టైటిల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అమీతుమీ తెల్చుకోనున్నాయి. 

తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో క్వాలిఫయర్‌లో​ రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఫైనల్‌కు పోరు అర్హత సాధించింది.

ఈ క్రమంలో కేకేఆర్‌ మూడో టైటిల్‌పై కన్నుయేగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో సారి టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌ లీగ్‌ దశలో పలు మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. 

ఆఖరి 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం ర‌ద్దు అయింది.

ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్‌ పడుతున్నారు.

ఫైనల్‌కు రిజర్వ్‌ డే..
ఇక బీసీసీఐ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయించింది. ఆదివారం(మే 26) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్‌ మొదులు కాకపోతే రిజర్వ్‌ డే అయిన  సోమ‌వారం మ్యాచ్‌ను నిర్వ‌హిస్తారు. ఒకవేళ మ్యాచ్‌ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్క‌డ‌నైతే మ్యాచ్ ఆగిందో అక్క‌డి నుంచే ఆటను కొన‌సాగిస్తారు. 

ఒక‌వేళ సోమ‌వారం కూడా మ్యాచ్‌ను నిర్వ‌హించేందుకు అవ‌కాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న కేకేఆర్‌ను విజేతగా ప్రకటిస్తారు. 

కాగా కనీసం సూపర్‌ ఓవర్‌ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే  తేలింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement