ముగిసిన ఆరవ విడత పోలింగ్‌... ప్రధాని మోదీ కీలక ట్వీట్‌ | Pm Modi Tweet On 6th Phase Polling | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆరవ విడత పోలింగ్‌... ప్రధాని మోదీ కీలక ట్వీట్‌

May 25 2024 8:32 PM | Updated on May 25 2024 8:32 PM

Pm Modi Tweet On 6th Phase Polling

న్యూఢిల్లీ: ఆరో విడత పోలింగ్‌లో ఓటు వేసిన వారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం(మే25) సాయంత్రం ఎక్స్‌(ట్విటర్‌)లో మోదీ ఒక పోస్టు చేశారు. ఆరో విడత పోలింగ్‌ తర్వాత ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు.

ఇండియా కూటమి ఎలాగూ అధికారంలోకి రాదని ప్రజలు తెలుసుకున్నారని, అందుకే వారికి ఓటు వేయడం వృథా అని భావిస్తున్నారు. ఇదిలాఉంటే తమకు ఈ ఎన్నికల్లో రానున్న 352 సీట్లలో ఇప్పటికే 272 సీట్లు తమ ఖాతాలో వేసుకున్నామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 

కాగా,  శనివారం ముగిసిన ఆరో విడత పోలింగ్‌తో దేశంలో ఇప్పటివరకు 486 ఎంపీ సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడవ, తుది విడత పోలింగ్‌ జూన్‌1న జరగనుంది.  జూన్‌ 4న ఫలితాలు రానున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement