స‌న్‌రైజ‌ర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్‌దే: ఆసీస్‌ లెజెండ్‌ | Legendary Australia Opener Matthew Hayden Picks His Favourite To Win IPL 2024 Final, Details Inside | Sakshi
Sakshi News home page

స‌న్‌రైజ‌ర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్‌దే: ఆసీస్‌ లెజెండ్‌

Published Sat, May 25 2024 4:00 PM

Matthew Hayden picks KKR as favourites to win IPL 2024

ఐపీఎల్‌-2024 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మే26) చెన్నైలోని చెపాక్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టైటిల్ పోరులో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. క్వాలిఫయ‌ర్ 1లో ఎస్ఆర్‌హెచ్‌పై విజ‌యం సాధించి కేకేఆర్ తుది పోరుకు అర్హ‌త సాధించ‌గా.. స‌న్‌రైజ‌ర్స్ క్వాలిఫ‌య‌ర్‌-2లో రాజ‌స్తాన్‌ను ఓడించి ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. 

ఈ క్ర‌మంలో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ విజేత‌ను ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గ‌జం మాథ్యూ హేడెన్ అంచనా వేశాడు. కేకేఆర్ ఛాంపియ‌న్స్‌గా నిలుస్తుంద‌ని హేడెన్ జోస్యం చెప్పాడు. "ఫైన‌ల్లో ఎస్ఆర్‌హెచ్‌పై కేకేఆర్ విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం నాకు ఉంది. 

ఫైన‌ల్‌కు ముందు కేకేఆర్‌కు మూడు రోజుల విశ్రాంతి ల‌భించింది. ఈ వ్య‌వ‌ధిలో ఎస్ఆర్‌హెచ్ బ‌లాలు, బలహీనతల‌పై కేకేఆర్ స్పెష‌ల్ ఫోకస్ చేసింటుంది.అంతేకాకుండా క్వాలిఫ‌యర్‌-1లో ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన కాన్ఫిడెన్స్ కూడా కేకేఆర్‌కు క‌లిసిస్తోంద‌ని నేను భావిస్తున్నాను.

అంతేకాకుండా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై నరైన్,వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది. కాబ‌ట్టి నావ‌రకు అయితే కేకేఆర్‌దే ట్రోఫీ అని" స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో హేడ‌న్ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement