RR Vs SRH: రాజ‌స్తాన్ చిత్తు.. ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన స‌న్‌రైజ‌ర్స్‌ | SRH Beat RR By 36 Runs And Enters IPl 2024 Final, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2024 RR Vs SRH: రాజ‌స్తాన్ చిత్తు.. ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన స‌న్‌రైజ‌ర్స్‌

Published Fri, May 24 2024 11:27 PM

SRH beat RR by 36 runs, Enters IPl 2024 Final

ఐపీఎల్‌-2024లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఫైన‌ల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో 36 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో స‌న్‌రైజ‌ర్స్ ఫైన‌ల్ పోరుకు అర్హ‌త సాధించింది. 

ఈ క్వాలిఫయ‌ర్‌-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత  స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్‌(34) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు సాధించాడు. 

తిప్పేసిన  షాబాజ్..
అనంత‌రం 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో ధ్రువ్ జురెల్‌(56) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..య‌శ‌స్వీ జైశ్వాల్‌(42) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

అయితే ల‌క్ష్య చేధ‌న‌లో రాజ‌స్తాన్‌ను ఎస్ఆర్‌హెచ్ స్పిన్న‌ర్ షాబాజ్ అహ్మ‌ద్ దెబ్బ‌తీశాడు. 3 వికెట్లు ప‌డ‌గొట్టి రాయ‌ల్స్ ప‌త‌నాన్ని శాసించాడు. అత‌డితో పాటు అభిషేక్ రెండు.. న‌ట‌రాజ‌న్‌, క‌మ్మిన్స్ త‌లా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ పోరులో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఎస్ఆర్‌హెచ్ త‌ల‌ప‌డ‌నుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement