ఓటు బ్యాంకు కోసం డ్యాన్సులు కూడా చేస్తారు: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

ఓటు బ్యాంకు కోసం వారు డ్యాన్సులు చేస్తారు: ప్రధాని మోదీ

Published Sat, May 25 2024 3:19 PM

PM Modi Comments On INDIA Bloc Leaders In Bihar

పాట్నా: ఓటుబ్యాంకు ముందు ఇండియా కూటమి నేతలు అవసరమైతే డ్యాన్సులు వేస్తారని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు.  ఓటు బ్యాంకు కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు లాక్కుంటానంటే తాను మాత్రం చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. 

శనివారం(మే25) బిహార్‌లోని పాటలీపుత్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి నేతలు వారి ఓటు బ్యాంకు కోసమే పనిచేస్తారని, తనకు మాత్రం రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టం చేశారు. ‘బిహార్‌ ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు నేను హామీ ఇస్తున్నా. మోదీ బతికున్నంతవరకు మీ హక్కులు ఎక్కడికి పోనివ్వను.

ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తామంటే ఇండియా కూటమి నేతలను చేయనివ్వండి. నాకు మాత్రం రాజ్యాంగమే ముఖ్యం. ఆర్జేడీ,కాంగ్రెస్‌ కూటమి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement