హార్ట్ ట‌చింగ్ సబ్జెక్ట్‌తో 'నాన్నంటే' సినిమా | Sakshi
Sakshi News home page

హార్ట్ ట‌చింగ్ సబ్జెక్ట్‌తో 'నాన్నంటే' సినిమా

Published Sat, May 25 2024 7:59 PM

Nannante Movie Premiere Show Public Talk In Hyderabad

మనసుని తాకే ఎమోషనల్ కంటెంట్‌తో తీసిన సినిమా 'నాన్నంటే'. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించగా.. అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. వై‌ఎస్‌కె, నిహరిక చౌదరి, వరేణ్య ఆగ్రా తదితరులు ప్ర‌ధాన‌ పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లోని ఫిలించాంబ‌ర్‌లో  ప్రీమియ‌ర్ షో వేశారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సినిమా చూసి ప్రశంసించారు. ప్ర‌తి ఒక్క‌రికీ నాన్న అంటే ఎంతో ఎమోష‌న్ ఉంటుందో ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా చూపించార‌ని అన్నారు. ఈ సినిమాలోని సందేశం యువ‌త‌కి కనెక్ట్ అవుతుందని అన్నారు.  

(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా బూతులు!)

నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ.. 'నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలి. అతి త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేస్తున్నాం' అని అన్నారు.

(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‍‌గా పెళ్లి చేసుకున్న ‍'స్ట్రేంజర్ థింగ్స్' నటి)

Advertisement
 
Advertisement
 
Advertisement