డ్రగ్స్‌ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు: విచారణకు రావాలని వారందరికీ నోటీసులు జారీ

Published Sat, May 25 2024 2:06 PM

Bengaluru Police Issue Notices To Actress Hema And Others

బెంగళూరు రేవ్‌ పార్టీలో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సీసీబీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నగర శివారులో గత ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసి సుమారు 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి చెందిన రక్త నమూన పరీక్షలో డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిందని పోలీసులు గుర్తించారు. తాజాగా వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌కు చెందిన సినీ నటి హేమ, ఆశూ రాయ్‌లకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు అరుణ్‌ చౌదరి, చిరంజీవి, క్రాంతి, రాజశేఖర్‌,సుజాత, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైశ్వాల్‌లకు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరందరూ కూడా మే 27న విచారణకు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదేశించారు. వీరికి డ్రగ్స్‌ ఎవరు ఇచ్చారు..? ఇంకా ఎవరెవరితో డ్రగ్స్‌ సంబంధాలు ఉన్నాయోనని విచారించనున్నారు. ఈ రేవ్‌ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఐదుగురుని  బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement