మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO సస్పెండ్ | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO లక్ష్మణ్ సింగ్ సస్పెండ్

Published Sat, May 25 2024 8:24 PM

Kamareddy DMHO Suspended Over Harassment Of Women Employees

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్లు రుజువుకావడంతో ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్‌, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు  ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్‌ సింగ్‌ నాయక్‌ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి వివరాలను సేకరించారు. తమను డీఎంహెచ్‌వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు. దీంతో లక్ష్మణ్‌సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మహిళా మెడికల్‌ ఆఫీసర్లను లక్ష్మణ్‌ సింగ్‌ వేధిస్తున్నాడని తేలడంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement