Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Twist In Andhra Pradesh Postal Ballot Counting Row
పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నిబంధనల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఈవో జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు గురువారం తెలిపింది. ఈ సీఈవో మెమోపైనే వైఎస్సార్‌సీపీ కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్‌ విచారణలో ఉండగానే.. ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం.

Ksr Comments On YS Jagan Mohan Reddy And Chandrababu's Complete Governance
ఇది కదా జగన్‌ అంటే.. ఆ రికార్డ్‌ ఆయనకే సొంతమవుతుంది.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ మే 30న తన పదవీకాలం ఐదేళ్లు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నందుకు ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇలాగే ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2014లో ఎన్నికయ్యాక ఐదేళ్లు పాలన చేసినట్లే అయినా, సాంకేతికంగా చూస్తే ఆయన ఎనిమిది రోజులు ముందుగానే పదవి కోల్పోయారు. ఎందుకంటే చంద్రబాబు 2014 జూన్ 8న పదవీ చేపట్టగా, ఎన్నికల్లో ఓడిపోయి 2019 మే 30 కంటే ముందే సీఎం పదవిని వదలిపెట్టవలసి వచ్చింది. కానీ వైస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలకు ఆ ఇబ్బంది రాలేదు. చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీఆర్‌ను కూలదోసి సీఎంగా అధికారం చేపట్టారు. 1999 అక్టోబర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చినా, 2003లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి కారణంగా 2004 మే నెలలోనే పదవిని కోల్పోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మిగిలిన సీఎంల కన్నా విభిన్నమైన రాజకీయవేత్త అని చెప్పాలి. వైఎస్సార్‌సీపీను స్థాపించడం, ఆ తర్వాత ఆయన అనేక కష్ట, నష్టాలు ఎదుర్కోవడం అంతా ప్రజలు గమనించారు. అక్రమ కేసులలో ఆయన జైలులో ఉన్నప్పుడు, ఆయన కోసం రాజీనామా చేసిన వారి నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ సంచలనాత్మకమైన రీతిలో గెలుపొందడం కూడా విశేషమే.2014 సాధారణ ఎన్నికలలో YSRCP అధికారంలోకి రాలేకపోయినా, గౌరవనీయ సంఖ్యలో విజయాలు సాధించింది. విపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలో పోరాట పటిమ తగ్గలేదు. తదుపరి సైతం అనేక పోరాటాలు చేయవలసి రావడం వంటి ఘట్టాల నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2019లో చరిత్రాత్మకమైన రీతిలో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎవరికి సాధ్యం కానీ రీతిలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి 151 సీట్లతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగలగడం ఒక రికార్డు. ఉమ్మడి ఏపీలో NTR, KCR, YS జగన్‌మోహన్‌ రెడ్డిలే సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. తెలుగు రాష్ట్రాలలో తండ్రులు ముఖ్యమంత్రులు అయ్యాక, వారి కుమారులు పలువురు రాజకీయాలలోకి వచ్చి మంత్రులు కాగలిగారు తప్ప, ముఖ్యమంత్రి అయింది మాత్రం YS జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్కరే.వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో 2009 లోనే ఎంపీగా గెలుపొందిన మాట నిజమే. కానీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భవిష్యత్తు ఒకరకంగా చెప్పాలంటే గందరగోళంలో పడింది. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరించి అవకాశం ఇవ్వలేదు. అదే ఆయనకు ఛాలెంజ్‌గా మారింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, తనదైనా పంథాలో ముందుకు సాగారు, గెలిచినా, ఓడినా సొంత రాజకీయం సాగించారు. సోనియాగాంధీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నందున కేసులు పెడుతుందన్న భయంతో వైఎస్ సన్నిహితులు సైతం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంట నడవడానికి భయపడినా, తాను మాత్రం తిరుగుబాటు వీరుడుగానే జనంలోకి వెళ్లి వారి హృదయాలను గెలుచుకున్నారు.మామ ఎన్టీఆర్‌నే కుట్ర పూరితంగా సీఎం పదవిని లాగిపడేసిన వ్యక్తి చంద్రబాబు. ఎప్పుడు ఎవరితో అవసరమైతే వారితో పొత్తు పెట్టుకోగల వ్యక్తి, ఆచరణ సాద్యం కానీ హామీలు ఇచ్చే వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు వంటి నేతను ఢీకొట్టడం అంటే తేలిక కాదని చాలామంది భావిస్తారు. కుట్ర రాజకీయాలలో ఘనాపాటిగా పేరొందిన చంద్రబాబును ఓడించడం ద్వారా రాజకీయాలలో విశ్వసనీయతకు ప్రాధాన్యం ఉందని మొదటిసారిగా రుజువు చేసిన నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అనైతిక రాజకీయాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు తాను ఏమి చెప్పానో, అవి చేయాల్సిందే అనే పట్టుదలతో కృషి చేసిన ముఖ్యమంత్రిగా కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తింపు పొందారు.చంద్రబాబు 2014 లో తాను ఇచ్చిన మానిఫెస్టోని మాయం చేస్తే, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2019లో తాను ప్రకటించిన మానిఫెస్టోని మంత్రులు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చి అమలు చేయాల్సిందేనని చెప్పి కొత్త సంస్కృతికి నాంది పలికారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేతంగా సంక్షేమ పథకాలు చేయలేదని చెప్పాలి. అంతేకాదు... తన టరమ్ పూర్తి అవుతున్న తరుణంలో మానిఫెస్టో కాపీలతో పాటు, ఏ కుటుంబానికి ఎంత మేలు చేసింది వివరిస్తూ ప్రతి ఇంటికి అభివృద్ది నివేదికలను తన ఎమ్మెల్యేల ద్వారా అందించి కొత్త ట్రెండ్ సృష్టించిన నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని చెప్పాలి. మనిషిని చూస్తే ఈయన నిజంగానే ఇన్ని చేశారా అనిపిస్తుంది. ఇంతమంది ఆయనపై కక్ష కడితే వారందరిని ఒంటి చేత్తో ఎదుర్కున్నారా? అనే భావన వస్తుంది. బక్కపలచగా ఉండి, సింపుల్ డ్రెస్‌లో కనిపించే ఈయన ఏపీలో ఇన్ని వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల ముందుకు పరిపాలనను తెచ్చి రాష్ట్రాన్ని సరికొత్తగా మార్చగలరని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.ప్రభుత్వంలోని దాదాపు అన్నీ రంగాలలో తనదైన మార్కును వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చూపించగలిగారు. పేదలు vs పెత్తందార్లు అనే నినాదాన్ని చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యవస్థలను ఆయన తెచ్చారంటే అతిశయోక్తి కాదు. కరోనా సంక్షోభ సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న చొరవ, వ్యాధి పాలిట పడిన వారికి అందించిన వైద్యసేవలు మొదలైనవి ప్రశంసనార్హం. ఆ టైమ్‌లో సైతం స్కీములను అమలు చేసి ఆదుకున్న నేతగా ప్రజల గుండెల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆశ్చర్యం కాదు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన రోల్ మోడల్ ప్రభుత్వాన్ని నడిపారు. దేశంలోనే ఎవరూ చేయని సరికొత్త ప్రయోగాలు చేశారని చెప్పాలి. అందులో అనేకం కీలకంగా ఉన్నాయి.వలంటీర్ల వ్యవస్థను పెడతానని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రభుత్వంలోకి రాగానే వలంటీర్లను పెడుతుంటే వీరంతా ఏమి చేస్తారో అనే అభిప్రాయం ఉండేది. రెండున్నర లక్షల మంది స్వచ్చంద సైన్యాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తయారు చేశారన్న సంగతి ఆ తర్వాత కానీ జనానికి అర్దం కాలేదు. వలంటీర్లు ఇళ్లకు వచ్చి కుశల సమాచారం అడగడం కాదు.. వారి పరిపాలనకు సంబంధించిన అవసరాలను తీర్చే వ్యవస్థగా మారారు. ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు. ప్రభుత్వమే ప్రతి ఒక్కరి గడప వద్దకు వెళ్లి సేవలందించడం అని పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చి అమలు చేయడం అతి పెద్ద విజయం అనిపిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు అవసరమైన పనులన్ని జరిగిపోవడం కొత్త అనుభూతి. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్టు కావాలన్నా, వేరే ఏ పని ఉన్నా, మండల ఆఫీస్‌ల చుట్టూనో, ఆ పైన ఉండే అదికారుల చుట్టూనో తిరిగే పరిస్థితిని తప్పించి తమ ఇళ్లకే అవన్ని చేరే ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిజంగా అభినందనీయుడు.ఈ సచివాలయాల కోసం ఏకంగా లక్షన్నర ఉద్యోగాలను ఒకే ఏడాదిలో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. రైతులు ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం తమ చెప్పులను ఆయా షాపుల వద్ద, ప్రభుత్వ గౌడౌన్‌ల వద్ద క్యూలో పెట్టవలసి వచ్చేది. ఇప్పటికి తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదిలాబాద్‌లో జరిగిన రైతుల ఆందోళన ఇందుకు ఉదాహరణ. ఏపీలో ఆ ఇబ్బంది లేకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేయగలిగారు. రైతులు తమ గ్రామంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలనుంచి అన్నీ సేవలు పొందగలుగుతున్నారు. అందువల్లే ఈ ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రైతు ఆందోళన చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు అమలు చేస్తామని చెబుతూ అంతా వచ్చి దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడు బారీ క్యూలు తెలంగాణ వ్యాప్తంగా కనిపించాయి. అదే ఏపీలో ఆ అవసరమే లేదు. వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అర్హత ఉంటే వారే నమోదు చేసుకుని స్కీమ్ అమలు చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే.ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన మార్పులు ఒక విప్లవం అని చెప్పాలి. స్కూళ్లు బాగు చేయడం మొదలు, ఆంగ్ల మీడియం, వారికి మంచి ఆహారం, డ్రెస్‌, పుస్తకాలు మొదలైనవి స్కూల్ తెరిచిన మొదటి రోజుల్లోనే ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఆంగ్ల మీడియం, ఐబీ సిలబస్, టోఫెల్ మొదలైన వినూత్న మార్పులు జరిగింది ఏపీలో మాత్రమే. వైద్య రంగంలోకూడా గణనీయమైన మార్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను మార్చారు. ప్రజల వద్దకే డాక్టర్‌లను పంపించే విధానం తెచ్చారు. ఊళ్లలో ఆరోగ్య శిబిరాలు పెట్టారు. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంచారు. తను చెప్పిన సంక్షేమ స్కీములను యధాతధంగా అర్హులైన వారందరికి అమలు చేసి చూపించారు. ప్రాంతం చూడలేదు. కులం చూడలేదు. మతం చూడలేదు. పార్టీ చూడలేదు. ఇది చాలామందికి నమ్మశక్యం కానీ విషయమే.అంతకుముందు టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల అవినీతి తతంగాలు చూసినవారికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకు వచ్చిన ఈ మార్పు ఆశ్చర్యాలను కలిగించింది. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం.. ఇలా ఒకటేమిటి సుమారు ముప్పైకి పైగా స్కీములను ఒక్క రూపాయి అవినీతి లేకుండా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా డిబిటి పద్దతి అమలు చేసిన ఘనత కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిదే. పేదలకు 31లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక సంచలనం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విపక్ష టీడీపీ తొలుత వీటన్నిటిని విమర్శించినా, తదుపరి తామూ అమలు చేస్తామని చెప్పడమే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజన్‌ను తెలియచేస్తుంది. అభివృద్ది వైపు చూస్తే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేయడం అన్నిటికన్నా పెద్ద ప్రగతి అని వేరే చెప్పనవసరం లేదు. తీర ప్రాంతంలో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిషరీస్ యూనివర్శిటీ, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, 700 కోట్లతో 800 గ్రామాలకు నీటి స్కీము, పదిహేడు మెడికల్ కాలేజీలు, పలు కొత్త పరిశ్రమలు, పార్మాహభ్, రెండున్నర లక్షల కోట్ల విలువైన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, నలభై వేల కోట్ల విలువైన సోలార్ పానెల్ పరిశ్రమ.. బద్వేలు వద్ద సెంచరీ ప్లైవుడ్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ.. ఇలా అనేకం టేక్ ఆఫ్ అయ్యాయి. విశాఖ నగరాన్ని ఒక సూపర్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టారు. ఆదాని డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ తదితర కంపెనీలు రావడం.. ఇలా ఒకటేమిటి వివిధ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకునేలా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇదేదో పొగడడానికి చెప్పడం లేదు. అలా అని విమర్శలు లేవని కాదు. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఒక్క మద్య నిషేధం హామీని అమలు చేయలేకపోయామని పార్టీనే అధికారికంగా చెప్పింది.శాంతి భద్రతలు ఐదేళ్లుగా పూర్తి అదుపులో ఉన్నా, ప్రతిపక్షం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దారుణమైన అబద్దాలు ప్రచారం చేశాయి. వీటిని ఎదుర్కోవడం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు పెద్ద సవాల్ అయింది. ఒకేసారి వివిధ రంగాలలో సంస్కరణలు చేపట్టడం, ఆయా వర్గాలలోని పెత్తందార్లకు ఆగ్రహం తెప్పించింది. ఉదాహరణకు ప్రభుత్వ స్కూళ్లు బాగు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు నచ్చలేదు. ప్రభుత్వ సేవలన్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడం, తద్వారా తమ ప్రాధాన్యత తగ్గిందన్న భావన, ముడుపులు దక్కకుండా పోతున్నాయన్న ఆక్రోశం అందరిలో కాకపోయినా కొంతమంది ఉద్యోగులలో ఏర్పడిందని అంటారు. ప్రభుత్వ స్కూళ్లు బాగు చేసి టైమ్‌కు టీచర్లను రావాలని చెబితే వారిలో కొందరికి కోపం వచ్చిందని చెబుతారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు చేయాలని, ఇతరత్రా పేదలకు ధరలు అందుబాటులో ఉంచాలని, దానిని బట్టి టిక్కెట్ల రేట్లు నిర్ధారిస్తామని చెప్పడం బడా సినిమా పెట్టుబడిదారులకు నచ్చలేదు.ఆస్పత్రులను బాగు చేసి, డాక్టర్‌లను పేదల ఇళ్లకు పంపడం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అంతగా ఇష్టం ఉండదు. భూముల రీసర్వే, ఈ స్టాంప్ విధానం, లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు తగ్గించడం, బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారికి అసంతృప్తి కలిగించింది. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు పచ్చి అబద్దాలను ప్రచారం చేశారు. ఆయా వ్యవస్థలను చంద్రబాబు బాగా ప్రభావితం చేస్తూ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అందులో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు బాగా తలనొప్పి తెప్పించారని చెప్పవచ్చు. మూడు రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి రానీవ్వకుండా విపక్షం వ్యవస్థల ద్వారా అడ్డుపడింది.ఇన్ని జరిగినా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎప్పుడూ పెత్తందార్ల ప్రతినిధిగా ఉండడానికి ఇష్టపడలేదు. పాదయాత్రలో సామాన్యుల కష్టాలు ఎలా తెలుసుకున్నారో, ఆ విధంగానే పేదల ప్రతినిధిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన సాగించారు. అదే శ్రీరామరక్ష అవుతుందని ఆయన నమ్మారు. అందుకే ధైర్యంగా తను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు. ఇలా చేసిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్కరే. ఎంత ఆత్మ విశ్వాసం లేకుంటే ఆయన ఆ మాట చెప్పగలుగుతారు! అదే ఆత్మ స్థైర్యంతో, ప్రత్యర్ధులు ఎంతగా వేధించినా తొణకకుండా, బెణకకుండా ఐదేళ్లు పూర్తి చేసుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సగర్వంగా ప్రజల ముందు నిలబడ్డారు. అదే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భవిష్యత్తు విజయానికి సంకేతంగా కనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Madhav Shingaraju Comments On Buddha Venkanna's Words That Nara Lokesh should Become Chief Minister
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!

‘‘మేము ఏకగ్రీవంగా చెబుతున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో.. దానికి సరిగ్గా ఆపోజిట్‌గా మరొక వేదిక ఏర్పాటు చేసి, అదే రోజు నారా లోకేశ్‌ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్‌ చేయాలి. ఇది మా డిమాండ్‌.’’ఈ డిమాండ్‌ చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కాదు! ఇటీవల చంద్రబాబు కటౌట్‌ను రక్తంతో కడిగిన ఆ పార్టీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న!! నాయకుడు అధినాయకుడిని డిమాండ్‌ చేయటం ఏంటి? పైగా లోకేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్‌ చేయటం ఏంటి? అందునా.. ఏక కాలంలో ఎదురెదురుగా రెండు వేదికలను ఏర్పాటు చేసి – ఈ వేదికపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎదురు వేదికపై చినబాబు పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగాలని కోరటం ఏమిటి? ఎందుకు ‘బుద్ధన్న’ అలా అన్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?లోకేశ్‌ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన్నిప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్ధా వెంకన్న డిమాండ్‌. అంటే.. ఇండైరెక్టుగా లోకేశ్‌ను సీఎంను చేయాలని సూచించటమా? లేక చినబాబుకు దగ్గర కావాలన్న వ్యూహమా? లేదంటే, చంద్రబాబు సూచన మేరకే అలా డిమాండ్‌ చేసి ఉంటారా? ఇవేవీ కాదంటే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఆయన అలా ఏమైనా అన్నారా? ఏదేమైనా టీడీపీలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఆసక్తికరమైన పరిణామం... బుద్ధా వెంకన్న డిమాండ్‌.టీడీపీ అధికారంలోకి వస్తుందా, రాదా అన్నది అటుంచి.. అసలు బుద్ధన్న ఇలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు అని ఆ పార్టీలోని నాయకులే అయోమయంగా ముఖాలు చూసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏదైనా గందరగోళం మొదలైందా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆలోచిస్తున్నది లోకేశ్‌ బాబు అధ్యక్షుడు అవుతాడా కాడా అని కాదు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అని. ఓటమి అంటే చంద్రబాబుకు భయం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయరు. పొత్తు కోసం చూస్తారు. పొత్తు కుదరకపోతే కొత్త ఎత్తులు ఏవైనా వేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమిని కట్టారు కనుక... ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలా అని ఆయన ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కొత్తగా ఏర్పడే జగన్‌ ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటానికి రామోజీ తో కలసి ఏదైనా వ్యూహాన్ని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేం. గెలుపు కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరు. ఓడిపోయినా కూడా... ఏమైనా చేయించగలరు!ఈ నేపథ్యంలో గత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన స్వయంకృతాపరాధాలు, ఆయన్ని గెలిపించిన ఎత్తులు, పొత్తులు; గెలుపు వంటి ఓటములు, ఓటమి వంటి గెలుపుల గురించి చూడటం అవసరం.చంద్రబాబుకు మొదటి అతి పెద్ద ఓటమి 2004లో ఎదురైంది. అంతకు ముందు 1999లో జరిగిన ఎన్నికలు ఆయన్ని పార్టీలో తిరుగులేని నేతగా నిలబెట్టాయి. అక్కడి ఉంచి నేరుగా, మళ్లీ లేవలేనంతగా 2004లో కిందికి పడేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనంలో సైకిల్‌ కొట్టుకుపోయింది. స్కూల్‌ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయటం మాత్రమే కాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు. జన్మభూమి కార్యక్రమాలకు తమను ఉపయోగించుకోవటం వారికి ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వోద్యోగుల పని విధి విధానాలలో కొత్తగా తెచ్చిన మార్పులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభావం చూపెట్టాయి.ఇంతకన్నా ముఖ్యం.. విద్యుత్‌ చార్జీలు, నీటి చార్జీల పెంపు. దీనిపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తే... హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో జరిగిన ధర్నాలో నిరసనకారులైన రైతులపై చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించారు. పోలీస్‌ కాల్పులలో రామకృష్ణ, విష్ణువర్థన్‌ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. బాబు పాలనలో మాయని మచ్చగా మిగిలిన ఉదంతం అది. ఇక 1995–2004 మధ్య రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం, అప్పుడే వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పాదయాత్ర! 2004 ఎన్నికల్లో ఆ రెండూ తమదైన ప్రభావం చూపి, బాబు ఓటమికి కారణం అయ్యాయి.ఇవికాక, మరికొన్ని కారణాలు కూడా ఆనాటి చంద్రబాబు ఘోర పరాజయానికి ఆజ్యం పోశాయి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు కనిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్‌ –2020 కలలు బెడిసికొట్టాయి. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి ఆయన ఆ కలలు కన్నారు. అవి సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్యవేత్తలను ఆకట్టుకుని ఉంటే ఉండొచ్చు. కానీ కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు భ్రమ పడ్డారు. గెలుపై ధీమాగా ఉన్నారు. చివరికి బోర్లా పడ్డారు. వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, పేదరికం నిర్మూలనపైనా ఆయన దృష్టి సారించకపోవటం కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.అంతకు ముందు 1999 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన మాట నిజమే అయినా అది ఏమాత్రం చంద్రబాబు ఘనత కాదు. కార్గిల్‌ యుద్ధ ప్రభావం గెలుపునకు దోహదపడింది. పాకిస్థాన్‌తో కార్గిల్‌ యుద్ధంలో గెలిచిన అనంతరం.. సాధారణ సమయానికి భిన్నంగా, కొన్ని నెలల ఆలస్యంగా సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది సెప్టెంబరులో జరిగాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో టై–అప్‌ అయ్యారు. తాము గెలిస్తే, కేంద్రంలో బీజేపీకి బయటి నుండి మద్ధతు ఇస్తామన్న హామీతో ఆయన ఆ ఎన్నికలకు వెళ్లారు.కార్గిల్‌ యుద్ధంలో గెలుపు వాజ్‌పేయిని గొప్ప నాయకుడిగా నిలబడితే ఆ నాయకుడితో చేయి కలపడం చంద్రబాబుకు గొప్పగా కలిసొచ్చింది. మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 సీట్లకు, బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తే తెలుగు దేశం 180 సీట్లలో గెలిచింది. అయినప్పటికి మునుపటి కన్నా 36 సీట్లు తగ్గాయి. బీజేపీకి మాత్రం అంతకుముందు కన్నా 9 సీట్లు పెరిగాయి. అంటే.. వాజ్‌పేయి ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ బీజేపీ ప్రభావంతోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించింది తప్ప అది చంద్రబాబు చరిష్మా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం కార్గిల్‌ ప్రభావం.2004 ఎన్నికల తర్వాత వరుసగా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకు కారణంగా చంద్రబాబు ఎలాంటి సాకులు చెప్పినా.. అసలు కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విశ్లేషణలో కనిపిస్తుంది.‘‘2009లో మా పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం పీఆర్‌పీ పార్టీ, లోక్‌సత్తా పార్టీలు కొత్తగా రావటం. దాంతో యాంటీ కాంగ్రెస్‌ ఓటు చీలటం జరిగింది. రెండవది – టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఈ హైదరాబాద్‌లో గానీ, రంగారెడ్డి జిల్లాలో గానీ మాకు ఏం సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్లు, రాష్ట్రం సపరేట్‌ కాకూడదని ఎక్కువమంది జనం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒకే ఒక్క సీటు రావటం జరిగింది. అందువల్ల మేము ఘోరంగా ఓడిపోవటం జరిగింది. యాంటీ కాంగ్రెస్‌ ఓటు చిరంజీవి, జయప్రకాష్‌ నారాయణ్‌ చీల్చుకోవటం కూడా మా ఓటమి కారణం. అప్పటికి కూడా కాంగ్రెస్‌ పార్టీ యొక్క ఓట్‌ బ్యాంకు దాదాపు 13 శాతం తగ్గింది. 2004లో 51 శాతం ఉన్న ఓట్‌ బ్యాంకు వాళ్లకు 38 శాతం అయింది. మేము 37 శాతంతో ఓడిపోయాం. ఒక్క పర్సెంట్‌ ఓట్ల తేడాతోనే మేము 2009 ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయాం. 92 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్‌ 155 మాత్రమే గెలిచింది. వాళ్లకు 35 సీట్లు తగ్గినయ్‌. మాకు దాదాపు 45 సీట్లు పెరిగాయి. రాజశేఖర రెడ్డి విజృంభించి ప్రచారం చేయటం కూడా జనంలో కొంత భయం కల్పించింది’’ అన్నారు ముద్దు కృష్ణమ నాయుడు.2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. వారి పొత్తు ఫలించి తెలుగుదేశానికి 25 సీట్లు, బీజేపీకి 7 సీట్లు పెరిగినప్పటికీ, వైఎస్సార్‌సీపీ ప్రభావంతో తెలుగు దేశం పార్టీ 117 సీట్లుకు మించి సాధించలేకపోయింది. ఆ మాత్రమైనా మోదీ హవాతో కొట్టకొచ్చిన సీట్లు, ఓట్లు మాత్రమే అవి.2019 గురించి ఇక చెప్పేదేముంది? వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ 175కి 151 సీట్లు గెలుచుకుని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, స్పెషల్‌ స్టేటస్‌పై యు–టర్న్, అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా మెల్లిగా నడిపించటం, కాపు ఓట్లు చీలుస్తాడని అనుకున్న పవన్‌ కల్యాణ్‌ హీరో ఫ్యాక్టర్‌ పని చేయకపోవటం, అవినీతి.. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి అందవలసిన నిధుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించి ఎన్‌.డి.ఎ. నుంచి బయటికి రావటం కూడా టీడీపీని దెబ్బకొట్టేసింది. దానికి మించి పార్టీలో చంద్రబాబు ‘వన్‌ మ్యాన్‌ షో’ పార్టీని ఒంటరిని చేసింది.ఈ అనుభవం రీత్యా మళ్లీ ఈ తాజా ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు ఫలిస్తుందా, మొదటికే మోసం తెస్తుందా అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతలో, ఆయన్ని బలపరుస్తుండే మీడియాలో కలవరం రేకెత్తిస్తోంది. అందుకే ఎన్నికలు ముగిసి, ఫలితాలు ఇంకా రాకముందే తెలుగు దేశం నాయకులు, రామోజీ రావు.. ‘గెలుపు కూటమిదే’ అని నినదిస్తున్నాయి. ఒకటి గమనించారా? ‘గెలుపు తెలుగుదేశానిదే’ వారు అనటం లేదు. – మాధవ్‌ శింగరాజు

T20 World Cup 2024 Rules Playing Format: Everything You Need To Know
T20 WC: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్‌ ఏంటి?.. పూర్తి వివరాలు

మెగా క్రికెట్‌ ఈవెంట్‌ టీ20 ప్రపంచకప్‌-2024 కోసం టీమిండియా సహా ఇతర జట్లన్నీ సంసిద్ధమైపోయాయి. పొట్టి ఫార్మాట్లో టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈసారి ఈ ఐసీసీ టోర్నీకి అమెరికా తొలిసారిగా వెస్టిండీస్‌తో కలిసి ఆతిథ్యం ఇస్తోంది.అదే విధంగా.. ఎన్నడూలేని విధంగా ఈసారి 20 జట్లు ఈసారి వరల్డ్‌కప్‌లో భాగం కానున్నాయి. మరి.. ప్రపంచకప్‌-2024 ఏ ఫార్మాట్లో జరుగనుంది? ఏ జట్లు ఏ గ్రూప్‌లో ఉన్నాయి? గ్రూప్‌ స్టేజీలో విజేతలను ఎలా నిర్ణయిస్తారు? సూపర్‌ ఓవర్‌ రూల్‌, రిజర్వ్‌డే సంగతేంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.నాలుగు గ్రూపులుటీ20 ప్రపంచకప్‌-2024లో పాల్గొనే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.👉గ్రూప్‌- ఏ: ఇండియా, పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, ఐర్లాండ్‌, కెనడా👉గ్రూప్‌- బి: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌👉గ్రూప్‌- సి: వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, ఉగాండా, పపువా న్యూగినియా👉గ్రూప్‌- డి: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌.గెలిస్తే ఎన్ని పాయింట్లు?.. గ్రూప్‌ స్టేజీ విజేతలను ఎలా నిర్ణయిస్తారు?👉గ్రూప్‌ దశలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. తమ గ్రూపులో ఉన్న నాలుగు జట్లతో ఒక్కోసారి తలపడుతుంది.👉ఇందులో అత్యధిక విజయాలు సాధించిన రెండు జట్లు సూపర్‌-8 దశకు అర్హత సాధిస్తాయి.👉కాగా గెలిచిన జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేరతాయి. మ్యాచ్‌ గనుక రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ వస్తుంది.👉గ్రూప్‌ దశలో రెండు జట్లకు సమానంగా పాయింట్లు వస్తే నెట్‌ రన్‌రేటు ఎక్కువగా ఉన్న జట్టు టోర్నీలో ముందుకు సాగుతుంది.👉అయినప్పటికీ రెండు లేదంటే అంతకంటే ఎక్కువ జట్లు గనుక సమానంగా నిలిస్తే ముఖాముఖి పోరులో ఎవరు విజయం సాధించారన్న అంశం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.సూపర్‌ ఓవర్‌ రూల్‌?ఏదేని మ్యాచ్‌ గనుక టై అయితే సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. రెండు సమానంగా నిలిస్తే గనుక ఫలితం తేలేదాకా సూపర్‌ ఓవర్‌ నిర్వహిస్తూనే ఉంటారు.సూపర్‌-8 దశకు చేరాలంటే అర్హతలు?గ్రూప్‌ దశలోని నాలుగు గ్రూపుల్లో ఒక్కో గ్రూపు నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-8కు చేరుకుంటాయి. సూపర్‌-8లో ఒక గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి.సెమీ ఫైనల్‌ చేరాలంటే?👉సూపర్‌-8 దశలో రెండు గ్రూపుల్లో ఉన్న టాప్‌-2 జట్లు సెమీ ఫైనల్‌కు చేరతాయి.👉గ్రూప్‌-1లో అగ్రస్థానంలో ఉన్న జట్టు- గ్రూప్‌-2లో రెండో స్థానంలో ఉన్న జట్టు మధ్య మొదటి సెమీ ఫైనల్‌ జరుగుతుంది. ఇందుకు ట్రినిడాడ్‌ వేదిక.👉గ్రూప్‌-2లో అగ్రస్థానంలో ఉన్న జట్టు- గ్రూప్‌-1లో రెండో స్థానంలో ఉన్న జట్టు మధ్య రెండో సెమీ ఫైనల్‌ జరుగుతుంది. ఇందుకు గయానా వేదిక.ఆటంకాలు ఎదురైతే..వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడితే.. సెకండ్‌ బ్యాటింగ్‌ చేసే జట్టు కనీసం ఐదు ఓవర్ల పాటు ఆడినా ఫలితం తేల్చే వీలుంటుంది.సెమీ ఫైనల్‌, ఫైనల్లో మ్యాచ్‌లలో సెకండ్‌ బ్యాటింగ్‌ చేసే జట్టు కనీసం పది ఓవర్ల పాటు ఆడాలి.రిజర్వ్‌ డే సంగతేంటి?👉తొలి సెమీ ఫైనల్‌, ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్‌ డే ఉంది. రెండో సెమీ ఫైనల్‌కు మాత్రం రిజర్వ్‌ డే లేదు.👉అయితే, రెండు సెమీ ఫైనల్స్‌లో ఆటంకాలు ఎదురైతే విజేతలను తేల్చే క్రమంలో అదనంగా 250 నిమిషాల సమయం ఇస్తారు.👉జూన్‌ 26 నాటి తొలి సెమీ ఫైనల్‌కు ఆరోజు 60 నిమిషాలు, మిగతా రోజు ఆట కొనసాగించేందుకు 190 నిమిషాలు ఇస్తారు.👉జూన్‌ 27 నాటి రెండో సెమీ ఫైనల్‌కు అదనంగా ఆరోజు అదనంగా 250 నిమిషాల సమయం ఇస్తారు. ఇక జూన్‌ 29 నాటి ఫైనల్‌కు జూన్‌ 30 రిజర్వ్‌ డే.👉రిజర్వ్‌ డే ఫలితం తేల్చే క్రమంలో ఇరుజట్లు కనీసం 10 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది.ఓవర్‌ రేటు రూల్‌?ఓ జట్టు గంట వ్యవధిలో కనీసం 14.1 ఓవర్లు బౌల్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే స్లో ఓవర్‌ రేటు కింద జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే, ఆటగాళ్లు తీవ్రమైన గాయాల బారిన పడినపుడు, వైద్య బృందం మైదానంలో చికిత్స చేసినపుడు.. లేదంటే థర్డ్‌ అంపైర్‌ రివ్యూ విషయంలో సమయం తీసుకున్నపుడు, బ్యాటింగ్‌ జట్టు సమయం వృథా చేసినపుడు, మన ఆధీనంలో లేని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు వెసలుబాటు ఉంటుంది.చదవండి: T20 WC: నో రిజర్వ్‌ డే! ఒకవేళ టీమిండియా సెమీస్‌ చేరితే.. జరిగేది ఇదే!

Ktr Protest At Charminar Agaianst Telangana Symbol Changes
TG: రాష్ట్ర చిహ్నం మార్పు.. చార్మినార్‌ ముందు కేటీఆర్‌ నిరసన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజముద్రలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద కేటీఆర్‌ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వ్యవహరిస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర చిహ్నం మారుస్తోందని దుయ్యబట్టారు. చార్మినార్‌ ముద్రను తీసేయడం హైదరాబాదీలను అవమానించడమే.. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు.మరోవైపు, రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని... కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందని మండిపడ్డారు.World over, Charminar has been the icon/symbol of Hyderabad for centuriesWhen one thinks of Hyderabad, they cannot but think of Charminar which has all the qualities of a UNESCO world heritage site Now Congress Government wants to remove the iconic Charminar from the state… pic.twitter.com/SQVxQAI6lL— KTR (@KTRBRS) May 30, 2024

Southwest Monsoon Winds Hit Kerala
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గురువారం ఉదయం కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. వారంలో తెలుగు రాష్టాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గతేడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు రాగా, ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు.. కేరళ రాష్ట్రాన్ని ఐఎండీ అలెర్ట్ చేసింది.నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు రాయల­సీమ­లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతా­వరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరు­తి రుతుపవనాలు దక్షిణ అరేబియా సము­ద్రం­లోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాల్లో విస్తరించాయి. లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగా­ళాఖాతం, ఈశాన్య బంగాళా­ఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి.కాగా, వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్‌ తుఫాన్‌ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

British Parliament Dissolves Ahead of General Elections
British Parliament Dissolve: బ్రిటన్‌ పార్లమెంట్‌ రద్దు..

బ్రిటన్‌ పార్లమెంట్‌ రద్దైంది. బ్రిటన్‌ సార్వత్రిక​ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా పార్లమెంట్‌ను గురువారం రద్దు చేశారు. ఇక, పార్లమెంట్‌ రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. దీంతో, నేటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ కానుంది.కాగా, జూలై నాలుగో తేదీన ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 23న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ వద్ద సునాక్‌ ఎన్నికల తేదీపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సునాక్‌ మాట్లాడుతూ..‘ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది’ అంటూ కామెంట్స్‌ చేశారు. #BreakingNews‌ #Updates #ukpolitics#British Parliament is formally dissolved ahead of July 4 general #election which polls indicate #Labour is expected to win over ruling #Conservative party pic.twitter.com/Lubf43M6r4— Tanveer Roomi (@TanveerRoomi) May 30, 2024ఇక బ్రిటన్‌ పార్లమెంట్‌లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. కాగా, గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి దాదాపు 129 మంది ఎంపీలు పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

IRDAI made some major changes in the regulatory norms for health insurance policies
క్యాష్‌లెస్‌ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్‌డీఏఐ ఆదేశాలు

ఆరోగ్య బీమా పాలసీదారు క్లెయిమ్‌ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్సపై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి తుది బిల్లు వచ్చాక మూడు గంటల్లోపు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. బుధవారం ఈమేరకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) మాస్టర్‌ సర్క్యులర్‌ విడుదల చేసింది. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై ఉన్న 55కు పైగా ఆదేశాలను క్రోడీకరించి దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.సర్క్యూలర్‌లోని వివరాల ప్రకారం..క్లెయిమ్‌ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీమా సంస్థలు, థర్డ్‌పార్టీ ఏజెన్సీలు తమకు అవసరమైన పత్రాలను పాలసీదారుల నుంచి కాకుండా నేరుగా ఆసుపత్రుల నుంచే సేకరించాలి. వయసు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా బీమా పాలసీని అందించాలి. అవసరాన్ని బట్టి కొత్త పాలసీలను తీసుకొచ్చే అవకాశం బీమా సంస్థలకు ఉంది.ఐఆర్‌డీఏఐ చేసిన కొన్ని మార్పులు..డిశ్చార్జీకి మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం జరిగి ఆసుపత్రి ఏదైనా అదనపు ఛార్జీలు విధిస్తే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ భరిస్తుంది.చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే వెంటనే క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. తక్షణమే ఆసుపత్రి నుంచి మృత దేహాన్ని తమ బంధువులకు అప్పగించాలి.పాలసీదారుల​కు సహాయం చేయడానికి బీమా కంపెనీలు ఆసుపత్రిలో ఫిజికల్ మోడ్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయవచ్చు.ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్న పాలసీదారులు తమకు ఆమోదయోగ్యమైన క్లెయిమ్ పొందగలిగే పాలసీని ఎంచుకోవచ్చు.పాలసీ తీసుకునేందుకూ, పాలసీ పునరుద్ధరణ, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి.బీమా కంపెనీలు పాలసీ డాక్యుమెంట్‌తో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్‌)ని కూడా అందించాలి. బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజీ వివరాలు, మినహాయింపులు.. వంటివి సులభ పదాల్లో తెలియజేయాలి.పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే వారికి నో క్లెయిమ్ బోనస్‌ లేదా ప్రీమియం తగ్గించే అవకాశాన్ని కల్పించవచ్చు.ఇదీ చదవండి: పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్‌లుఇటీవల లోకల్ సర్కిల్‌ చేసిన సర్వేలో 43 శాతం బీమా పాలసీదారులు గత మూడేళ్లలో తమ బీమా క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. చాలామంది పాలసీదారులు ఆసుపత్రిలో చేరిన చివరి రోజు వరకు తమ క్లెయిమ్‌ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సర్వే తెలిపింది.

'I Shut The Door': Shruti Haasan Shares Cryptic Post
హృదయ తలుపు మూసేశా.. బ్రేకప్‌ సాంగ్‌ పాడిన శృతిహాసన్‌

‘నా డోర్స్‌ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని హీరోయిన్‌ శృతిహాసన్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వారసురాలైన ఈమె తన తండ్రి నటించిన హేరామ్‌ చిత్రంతో బాల నటిగా రంగప్రవేశం చేశారు. 2009లో లక్‌ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 2011లో 7 ఆమ్‌ అరివు (సెవన్త్‌ సెన్స్‌) చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.తెలుగులో ఎక్కువ సక్సెస్‌అయితే ఆ తరువాత నుంచి శృతిని తమిళ సినీ పరిశ్రమ కంటే తెలుగు సినీ పరిశ్రమే ఎక్కువగా ఆదరిస్తూ వస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌బాబు, రవితేజ, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్నారు. ఇటీవల సలార్‌తో సక్సెస్‌ అందుకోగా ఇనిమేల్‌ అనే ప్రైవేట్‌ ఆల్బమ్‌లో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌తో కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు కూతురిగా నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మింగిల్‌ అవ్వాలనుకోవడం లేదుఇకపోతే శృతిహాసన్‌కు ప్రేమ అచ్చిరాలేదనుకుంటా.. ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వ్యవహారంలో విఫలం అయిన శృతిహాసన్‌ తాజాగా శాంతను హజారికా అనే టాటూ కళాకారుడికి బ్రేకప్‌ చెప్పిందని సమాచారం. దీంతో తాను ప్రస్తుతం సింగిల్‌నే అని.. మింగిల్‌ అవ్వాలనుకోవడం లేదని పేర్కొన్నారు. తాజాగా ‘ఐ షట్‌ ద డోర్‌. అండ్‌ ఐ ఈట్‌ ద కీ. ఐ వోంట్‌ బీ నీడింగ్‌ దట్‌ మీ ఎనీమోర్‌’ అంటూ ప్రేమలో ఓడిపోయిన వారు పాడుకునేలాంటి పాటను పోస్ట్‌ చేశారు. హృదయ తలుపులు మూసేశానని, ప్రేమ అనే తాళంతో దాన్ని తెరవాలనుకోవడం లేదని శృతి హాసన్‌ పాట రూపంలో పాడుతుందన్నమాట! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: పోలీసులతో హీరోయిన్‌ గొడవ.. వీడియో వైరల్‌

AP ECET Results 2024 Released
ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్‌

ఏపీ ఈసెట్‌ ఫలితాలు కోసం రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement