భార‌త్‌, న్యూజిలాండ్‌ కాదు.. ఆ రెండు జ‌ట్లు మ‌ధ్యే వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌ | Veteran Spinner Nathan Lyon Ignores India For T20 World Cup Final, Says Im Going To Go With Pakistan | Sakshi
Sakshi News home page

T20 WC: భార‌త్‌, న్యూజిలాండ్‌ కాదు.. ఆ రెండు జ‌ట్లు మ‌ధ్యే వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌

Published Thu, May 30 2024 2:52 PM

Veteran Spinner Nathan Lyon Ignores India For T20 World Cup Final

ఐపీఎల్-2024 ముగిసిన వెంట‌నే అభిమానుల‌ను అల‌రించేందుకు మ‌రో క్రికెట్ పండ‌గ సిద్ద‌మైంది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు మ‌రో రెండు రోజుల్లో తెర‌లేవ‌నుంది. జూన్ 1 నుంచి అమెరికా, కరేబియ‌న్ దీవుల వేదిక‌గా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. 

ఇప్ప‌టికే ఈ టోర్నీకి సంబంధించి వార్మాప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. అయితే ప్ర‌ధాన టోర్నీ ఆరంభానికి కేవ‌లం రెండు మాత్రమే ఉన్నంద‌న మాజీలు, వెట‌ర‌న్ క్రికెట‌ర్లు ఏ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుతుందో, ఏ జ‌ట్టు సెమీస్‌కు వెళ్తుందో అంచనా వేస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ నాథ‌న్ లియాన్ చేరాడు. ఈ మెగా టోర్నీలో ఫైన‌ల్‌కు చేరే జ‌ట్ల‌ను లియాన్ ఎంచుకున్నాడు. ఫైన‌ల్ పోరులో ఆసీస్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయ‌ని లియాన్ జోస్యం చెప్పాడు. 

తాజాగా  లియాన్‌  ప్రైమ్ వీడియో స్పోర్ట్స్ ఆస్ట్రేలియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంట‌ర్వ్యూలో భాగంగా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు చేరే జ‌ట్లు ఏవన్న ప్ర‌శ్న లియాన్‌కు ఎదురైంది. లియాన్ వెంట‌నే ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అని సమాధ‌న‌మిచ్చాడు.

"టీ20 వ‌ర‌ల్డ్‌కప్ ఫైన‌ల్‌కు ఆస్ట్రేలియా చేరుతుంద‌న్న న‌మ్మ‌కం నాకు ఉంది. మా జ‌ట్టు అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా ఉంది. ఇక నా వ‌ర‌కు అయితే ఫైన‌ల్‌కు చేరే మ‌రోజ‌ట్టు పాకిస్తాన్‌. విండీస్‌, యూఎస్ ప‌రిస్థితుల్లో పాకిస్తాన్ బ్యాటింగ్‌,  బౌలింగ్‌లో రాణిస్తుందని నేను భావిస్తున్నాను. 

అంతేకాకుండా జ‌ట్టులో నాణ్య‌మైన స్పిన్న‌ర్లు, బాబ‌ర్ ఆజాం వ‌ర‌ల్డ్‌క్లాస్ క్రికెట‌ర్లు ఉన్నారని" అని ప్రైమ్ వీడియో స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో లియాన్ పేర్కొన్నాడు. కాగా ఫైన‌ల్ చేరే జ‌ట్ల జాబితాలో టీమిండియాని ఎంచుకోపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement