మెస్సీ @ 900 గోల్స్‌ | Lionel Messi has reached another milestone | Sakshi
Sakshi News home page

మెస్సీ @ 900 గోల్స్‌

Mar 20 2026 2:01 AM | Updated on Mar 20 2026 2:01 AM

Lionel Messi has reached another milestone

ఫోర్ట్‌ లాడెర్‌డేల్‌ (అమెరికా): అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లయోనల్‌ మెస్సీ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఫుట్‌బాల్‌ కెరీర్‌లో 900 గోల్స్‌ సాధించిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా ఇప్పటిదాకా మరో స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకే పరిమితమైన ‘900 గోల్స్‌’ జాబితాలో తానూ భాగమయ్యాడు. 

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ నార్త్, సెంట్రల్‌ అమెరికా అండ్‌ కరీబియన్‌ అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ (కాన్‌కకాఫ్‌) చాంపియన్స్‌ కప్‌లో ఇంటర్‌ మయామికి ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ... నష్ విల్లేతో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో గోల్‌ చేయడం ద్వారా ‘900’ క్లబ్‌లో చేరాడు. 

బ్రెజిలియన్‌ దివంగత దిగ్గజం పీలే 1000 గోల్స్‌ చేసినట్లుగా ఉన్నప్పటికీ అధికారిక గోల్స్‌ స్కోరు మాత్రం సుమారు 800 మాత్రమే! ఎందుకంటే పీలే చేసిన వెయ్యి గోల్స్‌లో దిగువ స్థాయి మ్యాచ్‌ల్లో చేసినవి కూడా కలిపారు. దీంతో ఫుట్‌బాల్‌ విశ్లేషకుల లెక్కల ప్రకారం 900 క్లబ్‌లో ప్రస్తుతం రొనాల్డో, మెస్సీలు మాత్రమే ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement