పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌ | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌

Published Thu, May 30 2024 3:20 PM

పారిశ

కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో రానున్న మూడు రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ నిర్వహిస్తామని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, జిల్లా మలేరియా నివారణ అధికారికి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో దోమల వ్యాప్తి నివారణకు విధిగా అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. దోమల వ్యాప్తి నివారణలో భాగంగా లార్వా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టాలని సూచించారు. నిల్వ ఉన్న నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలన్నారు. దోమల నివారణకు ఆయిల్‌ బాల్‌లు, ఇతర కీటక నాశిని పదార్థాలు ఉపయోగించాలన్నారు. తాగునీటి సరఫరా పైపుల పరిస్థితి తనిఖీ చేయాలని, తాగునీరు కలుషితం కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. పల్లె ప్రజలు సైతం మరుగుదొడ్లు వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. బావులు, కుళాయిలు, బోరుల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. టీకే జమ్ము గ్రామ పంచాయతీ పరిధిలోని టీకే జమ్ము, పెదదోడిజ, గొర్లి, గొర్లివలస తదితర గ్రామాల్లోనూ, మావుడి గ్రామ పంచాయతీ పరిధిలోని మధుర పురిగానివలస గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్‌ చేపట్టారు. తాగునీటి బావుల్లో క్లోరినేషన్‌ చేపట్టారు. పూడికలు తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టి, దోమల వ్యాప్తి నివారణ చర్యలు తీసుకున్నారు. కార్యక్రమాలను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యవేక్షించారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌
1/1

పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement