చెస్‌ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు | Do You Know These Amazing Health Benefits Of Playing Chess, Explained In Telugu | Sakshi
Sakshi News home page

Playing Chess Benefits: చెస్‌ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు

Published Thu, May 30 2024 11:02 AM

Benefits Of Playing Chess

చెస్ అనేది అనేక ప్రయోజనాలను అందించి, మేధో సంపత్తిని పెంపొందిచే మనోహరమైన క్రీడ. ఈ క్రీడను క్రమం తప్పకుండా ఆడటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

దృక్కోణం పెరుగుతుంది: చెస్‌కు క్రమం తప్పకుండా ఆడటం వల్ల వ్యక్తుల యొక్క దృక్కోణం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎదుటివారి కదలికలను సులువుగా పసిగట్టవచ్చు. సామాజిక సంబంధాలు మెరుగుపర్చుకోవడంలో చెస్‌ క్రీడ కీలకపాత్ర పోషిస్తుంది.

జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది: ప్రతి రోజు కొంత సమయం పాటు చెస్‌ ఆడటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చెస్‌ అనునిత్యం ఆడటం వల్ల దృశ్య నమూనాలను మరింత త్వరగా గుర్తిస్తారు.

చురుకుదనం పెరుగుతుంది: చెస్‌ ఆడటంలో నైపుణ్యం కలిగిన వారు ఇతరులతో పోలిస్తే మానసిక చురకుదనం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి మానసిక స్థితి అథ్లెట్లు, కళాకారుల మాదిరిగా ఉంటుంది.

ప్రణాళికా నైపుణ్యాలను పెంచుతుంది: చెస్‌ క్రమం తప్పకుండా ఆడటం వల్ల ప్రణాళి​కా నైపుణ్యం, దూరదృష్టి పెరుగుతాయి. ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది.

స్వీయ-అవగాహన పెరుగుతుంది: చెస్‌ ఆడటం వల్ల స్వీయ అవగాహన పెరుగుతుంది. దీని వల్ల మనల్ని మనం విశ్లేషించుకోవచ్చు. మన తప్పులు మనం తెలుసుకోగలుగుతాం.

వృద్దాప్యంలో తోడ్పడుతుంది: మానసిక ఉత్తేజాన్ని కలిగించే చెస్‌ను క్రమం తప్పకుండా ఆడటం వల్ల వృద్దాప్యంలో ఎదురయ్యే మేధస్సు క్షీణత వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

ఏకాగ్రత సాధించేందుకు దోహదపడుతుంది: చెస్‌ అనునిత్యం ఆడటం వల్ల  ఏకాగ్రత లోపం సమస్య నుంచి బయటపడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

భయాందోళనలను  తగ్గిస్తుంది: చెస్‌ ఆడే సమయంలో చూపే ఏకాగ్రత కారణంగా భయాందోళనలు తగ్గుతాయి.

పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి: చిన్నతనం నుంచి చెస్‌ ఆడటం అలవాటు చేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement