 
													గోవా వేదికగా జరగనున్న ఫిడే ప్రపంచ కప్ 2025లో తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ పాల్గోనున్నాడు. రిత్విక్ మొదటి రౌండ్‌లో కజకిస్థాన్‌కు చెందిన నోగర్‌బెక్ కాజిబెక్‌తో తలపడనున్నాడు. . ఈ ఇద్దరు ఆటగాళ్లు నవంబర్ 1, 2 తేదీలలో రెండు క్లాసికల్ గేమ్‌లు ఆడతారు. ఒకవేళ రెండు రౌండ్ల తర్వాత పాయింట్లు సమానమైతే ఈ ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు నవంబర్ 3న రాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో టై-బ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు.
ఇక ప్రపంచ కప్‌లో పాల్గొనడం పట్ల రాజా రిత్విక్ సంతోషం వ్యక్తం చేశాడు. వరల్డ్‌లోనే అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడనుండడం తన స్కిల్స్‌కు నిజమైన పరీక్ష అని రిత్విక్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 80 దేశాల నుంచి మొత్తం 208 మంది చెస్ ఆటగాళ్లు భాగం కానున్నారు. అయితే భారత్ నుంచి మొత్తం 24 మంది ప్లేయర్లు తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
