ఆ ఘటన షాక్‌కు గురిచేసింది: శశి థరూర్‌ | Sakshi
Sakshi News home page

ఆ ఘటన షాక్‌కు గురిచేసింది: శశి థరూర్‌

Published Thu, May 30 2024 12:33 PM

Shashi Tharoor Reacts on Aide Caught Delhi Airport With 35 Lakh Gold

ఢిల్లీ: తన మాజీ సిబ్బందిలో ఒకరిని గోల్డ్‌ స్మగ్లింగ్‌ విషయంలో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకోవటం షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ అన్నారు. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌ పోర్టులో రూ. 35 లక్షల బంగారంతో శివ ప్రసాద్ అనే వ్యక్తి కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో అధికారులు అయన్ను అదుపులోకి  తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్‌ నేత శిశి థరూర్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.

‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను ధర్మశాలలో ఉన్నా. నా వద్ద తాత్కాలికంగా పని చేసిన సిబ్బందిని బంగారం స్మగ్లింగ్‌   చేస్తున్నారన్న విషయంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకోవటంపై షాక్‌కు గురయ్యాను. 72 ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసీస్‌ చేయించుకుంటున్నారు. ఆ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు  చేస్తున్న అధికారులకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నా. చట్టం తన పని తాను చేస్తుంది’’ అని థరూర్‌ అన్నారు.

 

బుధవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3 లో కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో 500 గ్రాములో బంగారంలో శవ ప్రసాద్‌ అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఆయన వద్ద ఉన్న బంగారంపై ప్రశ్నించగా సంబంధం లేని సమాధానం చెప్పటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ సహాక సిబ్బంది అని అధికారులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement