
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
కేజీఎఫ్: ఆగ్నేయ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీటీ శ్రీనివాస్ తరపున ఎమ్మెల్యే రూపా శశిధర్ బుధవారం నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ప్రచారం నిర్వహించారు. విద్యా సంస్థలను నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అవధిలో అన్ని పనులను చక్కబెడతారన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే ప్రామాణిక ప్రయత్నం చేస్తారన్నారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ పాత పింఛన్ విధానాన్ని తిరిగి తెస్తారన్నారు. ఏపీఎంసీ అధ్యక్షుడు విజయరాఘవరెడ్డి, మాజీ జెడ్పీ సభ్యుడు లక్ష్మీనారాయణ, వెంకటేష్, న్యాయవాది పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.