కాలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఆగిన నీటి సరఫరా
చెరువుల సంరక్షణకు
చర్యలు చేపట్టండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పురాతన కాలపు చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఆదేశించారు. బుధవారం బెళగావి విధానసౌధలో నీటిపారుదల శాఖ, భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరువుల సంరక్షణ సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలకు, పట్టణాలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పైపులైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు.
గ్యారెంటీల అమలులో
ప్రగతి సాధించాలి
బళ్లారిటౌన్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్యారెంటీ పథకాల అమలులో ఉత్తమ ప్రగతి సాధించాలని గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార జిల్లాధ్యక్షుడు కేఈ.చిదానందప్ప అధికారులకు సూచించారు. బుధవారం కోట ప్రాంతంలోని జెడ్పీ నజీర్ సభాంగణంలో ప్రగతి పరిశీలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం గృహలక్ష్మి, గృహజ్యోతి, శక్తి పథకం వంటి అనేక పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. వాటిని లబ్ధిదారులకు అందేలా అధికారులు శ్రమించాలన్నారు. తాలూకా స్థాయిలో ప్రగతి పరిశీలన జరిపి ఆయా జీపీల్లో కూడా సమర్థవంతంగా పని చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గృహలక్ష్మి పథకంలో జిల్లాలో 2 లక్షల 90 వేల మందికి పథకం అమలు చేసి ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పాత గేట్ల తొలగింపు
పనుల పరిశీలన
● 24 నుంచి కొత్త గేట్ల ఏర్పాటు పనులు షురూ
హొసపేటె: తుంగభద్ర డ్యాం పాత గేట్ల తొలగింపు ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు గేట్లను తొలగించారు. తుంగభద్ర డ్యాంలోని అన్ని గేట్లను మార్చాల్సిన నేపథ్యంలో పాత గేట్ల తొలగింపు ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18, 20, 24, 27వ నెంబరు గేట్లను తొలగించారు. గేట్ నెంబర్ 28 తొగింపు ప్రక్రియ ప్రారంభమైంది. తుంగభద్ర డ్యాంను సందర్శించిన సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లి డ్యాం గేట్ల తొలగింపు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాత గేట్ల తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని అన్నారు. ఇక కొత్త గేట్ల ఏర్పాటు నిర్ణీత సమయంలోగా పూర్తవుతుందన్నారు. కొత్త గేట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.10 కోట్లు విడుదల చేసిందని కూడా ఆయన అన్నారు.
శామనూరు సేవలు అనన్యం
రాయచూరు రూరల్: దావణగెరె దక్షిణ శాసన సభ్యుడు శామనూరు శివశంకరప్ప మరణంపై నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో వీర శైవ సమాజం ఏర్పాటు చేసిన సంతాప సభలో కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి ఽశివాచార్య శామనూరు శివశంకరప్ప చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రసంగించారు. సమాజానికి తోడు పేద ప్ర జలకు చేసిన సేవలను గురించి మాట్లాడారు. వ్యాపారం, సమాజసేవలు, రాజకీయం, ధర్మం పట్ల చేసిన క్రషిని అభినందించారు.
రాయచూరు రూరల్: నగరంలో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో చలికాలంలోనే తాగునీటి ఎద్దడి అధికమైంది. అయినా అధికారులు మౌనం వహిసున్నారు. జలనిర్మల పథకం కింద రూ.100 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో తాగు నీటి సమస్య అధికమైంది. తాగునీటి ఎద్దడి విషయంలో నగరసభ యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. బుధవారం నగరంలోని గంగానివాస్ వద్ద ఉన్న పంప్‌హౌస్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, మోటార్లు కాలిపోయాయి. సోమవారం వదిలిన నీటితో శుక్రవారం వరకు ప్రజలు నీటి కోసం పడిగాపులు పడాల్సిందే. ఇక ట్యాంకర్ల ద్వారా నగరవాసులు నీటిని పొందాల్సి వస్తుంది. 1వ వార్డు నుంచి 10వ వార్డు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి రెండు రోజుల నుంచి నీరు రాకుండా పోయింది. నీటిని సరఫరా చేసే పంపులు, మోటార్లు కాలిపోగా మరమ్మతు పనులు చేపట్టడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తాగునీటి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించలేదు. ఇప్పటికై నా నగరసభ అధికారులు చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
రెండు రోజులుగా సరఫరా కానీ తాగు నీరు
మరో రెండు రోజులు నీటి సరఫరా లేదు
కాలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఆగిన నీటి సరఫరా
కాలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఆగిన నీటి సరఫరా
కాలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఆగిన నీటి సరఫరా


