విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

Dec 19 2025 12:37 PM | Updated on Dec 19 2025 12:37 PM

విద్య

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

హొసపేటె: విజయనగర జిల్లా యంత్రాంగం, జెడ్పీ, విజయనగర డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయం, పాఠశాల విద్యా శాఖ, విజయనగర జిల్లా స్థాయి ప్రతిభా కారంజి, కళోత్సవాన్ని హొసపేటె ఎంపీ ప్రకాష్‌ నగర్‌లోని మార్కండేశ్వర్‌ ఇంగ్లిష్‌ మీడియం ప్రైమరీ, హైస్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హొసపేటె నగరాభివృద్ధి సంస్థ(హుడా) చైర్మన్‌ హెచ్‌ఎన్‌ఎఫ్‌. మహమ్మద్‌ ఇమాం నియాజీ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. జిల్లా స్థాయి ప్రతిభా కారంజికి ఎంపికై న విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి విజయనగర నియోజకవర్గ కీర్తి పతాకాన్ని ఎగరవేయాలని ఆకాంక్షించారు. ఏఎస్పీ మంజునాథ్‌, బీఈఓ శేఖర్‌ హొరపేటె తదితరులు పాల్గొన్నారు.

బాగల్‌కోటె కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

సాక్షి,బళ్లారి: గదగ్‌ జిల్లాధికారి కార్యాలయం, మంగళూరు ఆర్టీఓ కార్యాలయానికి బాంబు బెదిరింపులతో పోలీసులు ఆ దిశగా తీవ్రంగా తనిఖీ చేస్తున్న నేపథ్యంలో తాజాగా బాగల్‌కోటె జిల్లాధికారి కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. బాగల్‌కోటె జిల్లాధికారి కార్యాలయానికి ఈ–మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపు చేయడంతో అధికారులు తీవ్ర భయాందోళన చెందారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ నిష్క్రియ దళంతో తనిఖీ చేస్తున్నారు. జిల్లాధికారి కార్యాలయాన్ని జల్లెడ పట్టి అణువణువు బాంబు కోసం వెదికారు.

14 నుంచి అంబిగర శరణ సంస్కృతి ఉత్సవాలు

బళ్లారిటౌన్‌: నిజ శరణ అంబిగర చౌడయ్య గురుపీఠం ఆధ్వర్యంలో హావేరి జిల్లాలోని నరసాపురలో అంబిగర 10వ శరణ సంస్కృతి ఉత్సవాలను జనవరి 14 నుంచి రెండు రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నట్లు గురుపీఠం శాంతభీష్మ చౌడయ్య స్వాములు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని పత్రికా భవనంలో ఆ సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బీ.మౌలాలి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలి రోజున ఊయల ఉత్సవం, ఐక్య మంటప పూజలు, సామూహిక రక్తదాన శిబిరం, సామూహిక వివాహాలు, ప్రతిభావంతులకు పురస్కారాలు, గంగా హారతి, జానపద సాంస్కృతిక కార్యక్రమాలు, రెండవ రోజున ధర్మ ధ్వజారోహణం, ధర్మసభ, వివిధ మంటపాలు, శిలా శాసనాలు, సాయంత్రం మహరథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఆశ్రమానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, సమాజం నేతలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో గంగామతస్థుల సంఘం నేతలు రిటైర్డ్‌ ఆర్‌టీఓ పంపాపతి, సిద్దప్ప, శివమూర్తి దాక్షాయిణి, కేఎస్‌.బసవరాజు, ఈశన్న, జగదీశ, నాగరాజు, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ఉప కేంద్రం

ఏర్పాటు తగదు

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతంలో కేపీటీసీఎల్‌ విద్యుత్‌ ఉప కేంద్రం ఏర్పాటు చేయడం తగదని గ్రామస్థులు పేర్కొన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఆంజనేయ మాట్లాడారు. రాయచూరు తాలూకా చంద్రబండ జెడ్పీ పరిధిలోని అరసికెరె వద్ద చేపట్టనున్న విద్యుత్‌ ఉప కేంద్రం ఏర్పాటు భావ్యం కాదని, 70 ఎకరాల భూమిని భూమి లేని పేదలకు పంచాలని 34 ఏళ్ల క్రితం పంపిణీ చేశారన్నారు. అలాంటి స్థలంలో 9 మందికి భూములను కేటాయించిన ప్రభుత్వం కేపీటీసీఎల్‌ ఉప కేంద్రం ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు.

బొగ్గు చౌర్యంపై క్రిమినల్‌ కేసు

రాయచూరు రూరల్‌: యరమరాస్‌ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్‌)లో బొగ్గు అక్రమంగా దొంగతనం అవుతోందని, అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములైన వారిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. బొగ్గును వైటీపీఎస్‌ ఇంజినీర్లు హరీష్‌, చంద్ర శేఖర్‌, సబ్‌ కాంట్రాక్ట్‌ పొందిన పవర్‌ మేక్‌ సూపర్‌వైజర్‌ హరికృష్ణ, మేనేజర్‌ సురేంద్రనాథ్‌, స్టేషన్‌ మాస్టర్‌ సర్కార్‌, వ్యాగన్ల క్లీనింగ్‌ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్‌ప్రైజస్‌ శేషగిరిలపై గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైనట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు.

విద్యార్థులు అన్ని  రంగాల్లో రాణించాలి 1
1/2

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

విద్యార్థులు అన్ని  రంగాల్లో రాణించాలి 2
2/2

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement