విమానంలో నగ్నంగా పరుగెత్తిన ప్రయాణికుడు | Sakshi
Sakshi News home page

విమానంలో నగ్నంగా పరుగెత్తిన ప్రయాణికుడు

Published Tue, May 28 2024 7:41 PM

Passenger Run Obscene In Flight In Australia

పెర్త్‌: ఆస్ట్రేలియాలోని ఓ విమానంలో ఒక ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతటితో ఆగకుండా సిబ్బందిని కిందకు తోసేసి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్‌ ఆస్ట్రేలియా విమానంలో జరిగింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు వీఏ 696 విమానం సోమవారం(మే27) రాత్రి బయలుదేరింది. 

పెర్త్‌లో విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు.  దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని తోసేశాడు. అతడి చేష్టలతో తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. 

దీంతో పైలట్‌ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. విమాన సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని నగ్నంగా పరుగులు తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement