Banjara Hills: నేను ముంబైలో ఉన్నా..పెళ్లి చేసుకున్నా | Banjara Hills Woman Message To Mother | Sakshi
Sakshi News home page

Banjara Hills: నేను ముంబైలో ఉన్నా..పెళ్లి చేసుకున్నా

May 30 2024 6:43 AM | Updated on May 30 2024 6:43 AM

Banjara Hills Woman Message To Mother

తల్లికి ఇన్‌స్టాలో మెసేజ్‌ చేసి కూతురు అదృశ్యం 

బంజారాహిల్స్‌: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని ఇన్‌సాగ్రామ్‌లో తల్లికి పోస్ట్‌ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్‌ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు మరో పోస్ట్‌ చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–11లోని ఉదయ్‌నగర్‌లో నివసించే బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. ఇన్‌సాగ్రామ్‌లో చురుగ్గా ఉంటుంది. సోషల్‌ మీడియాను బాగా ఫాలో అవుతుంది. ఇందులో భాగంగానే ఇన్‌స్టాలో జహ్రనగర్‌లో సైఫ్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు.

 ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్‌స్టాలోనే తాను సైఫ్‌ను పెళ్లి చేసుకున్నానని, ముంబయ్‌లో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్‌కు వెళ్తుండేదని, సైఫ్‌ అనే యువకుడు ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement