బైక్‌ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు.. ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు.. ఒకరు మృతి

Published Thu, May 30 2024 2:11 PM

Speeding BMW Hits Motorcycle In Punjab Mohali 1 Dead 2 Critical

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, తాగి డ్రైవ్‌ చేయడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి కారణాలు ప్రమాదాలకు మూలంగా మారాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోర్షే కారుతో 24 ఏళ్ల టెక్కీలపై దూసుకెళ్లిన ఈ ఘటనలో రోజుకో కుట్ర కోణం వెలుగుచూస్తోంది.

తాజాగా పంజాబ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొహాలిలో బుధవారం రాత్రి జరిగింది ప్రమాదం.  బనూర్ వైపు నుంచి వస్తున్న కారు జిరాక్‌పూర్ పాటియాలా హైవేపై  బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీకి, కారుకు మధ్య బైక్‌ ఇరుక్కుపోయింది.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా.. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాహిబ్‌ అనే వ్యక్తి మరణించారడు. పభాత్‌ గ్రామానికి చెందిన సుమిత్‌, రాజ్‌వీర్‌లు సింగ్‌లు చికిత్స పొందుతున్నారు.  ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు పాటియాలా హైవేను దిగ్బంధించారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత కారు డ్రౌవర్‌ పరారయ్యాడు. కారుపై వీఐపీ నెంబర్‌ ఉందని పోలీసులు తెలిపారు. రవాణా మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2022లో 67,000 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. 30,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
 
Advertisement
 
Advertisement