నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్ | NATS Support To Mentally Retarded At Nidadavole | Sakshi
Sakshi News home page

నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్

May 29 2024 1:28 PM | Updated on May 29 2024 6:28 PM

 NATS Support To Mentally Retarded At Nidadavole

అమెరికాలో తెలుగు వారికి పలుసార్లు అండగా నిలిచిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నిడదవోలు మండలం రావిమెట్లలో హృదయాలయం మానసిక దివ్యాంగుల పాఠశాలకు నాట్స్ తన వంతు చేయూత అందించింది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ఈ పాఠశాలను సందర్శించారు. మానసిక దివ్యాంగుల చదువుకు వినియోగించే మెటీరియల్ కోసం 50 వేల రూపాయలను నాట్స్ అందించింది. 

హోప్ ఫర్ స్పందన సహకారంతో గత కొంత కాలంగా నాట్స్ మానసిక దివ్యాంగులకు చేయూత అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది.  సమాజంలో మానసిక దివ్యాంగులకు మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన బాధ్యత ఉందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. నాట్స్ మానసిక దివ్యాంగులకు అండగా నిలిచేందుకు తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. దివ్యాంగుల కోసం నాట్స్‌తో కలిసి పనిచేస్తున్న హోఫ్ ఫర్ స్పందనకు  నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి..వాటర్‌ ట్యాంక్‌ని క్లీన్‌ చేస్తుండగా..)

Advertisement
 
Advertisement
Advertisement