తన భర్తతో కలిసి ఇటీవల ఈ బ్యూటీ ఐపీఎల్-2024 ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు.
తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ట్రోఫీని ముద్దాడి సంబరాలు చేసుకున్నారు.
ఈమె మరెవరో కాదు.. టీమిండియా స్టార్ గౌతం గంభీర్ భార్య.. పేరు నటాషా జైన్
టీమిండియా ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు గంభీర్
టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలిచిన భారత జట్టులో సభ్యుడు
గంభీర్ భార్య నటాషా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందినవారు
ఆమె తండ్రి వ్యాపారవేత్త.. నటాషా చిన్నతనంలోనే ఆమె ఫ్యామిలీ ఢిల్లీకి వలస వచ్చారు
నటాషా 26 జూలై 1984లో జన్మించారు
2011లో ఆమె గౌతం గంభీర్‌ను పెళ్లాడారు
ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు ఆజిన్, అనైజా సంతానం
గంభీర్ ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా నియమితుడయ్యాడు
అతడి మార్గదర్శనంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన కేకేఆర్ ఈ ఏడాది చాంపియన్‌గా అవతరించింది
ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడించి కేకేఆర్ ట్రోఫీ గెలిచింది
ఈ క్రమంలో భర్త, పిల్లలతో కలిసి నటాషా ఫొటోలకు ఫోజులివ్వగా వైరల్‌గా మారాయి


