దిగివచ్చిన బంగారం, వెండి! | Sakshi
Sakshi News home page

దిగివచ్చిన బంగారం, వెండి!

Published Thu, May 30 2024 3:25 PM

gold price today silver rate may 30

బంగారం కొనుగోలుదారులకు దాదాపు రోజుల తర్వాత భారీ శుభవార్త ఇది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మే 30) భారీగా తగ్గాయి. 10 గ్రాములు (తులం) బంగారం రూ.440 మేర తగ్గి పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించింది.

తెలుగు రాష్ట్రాల్లో..
రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు తగ్గింది.

ఇతర నగరాల్లో..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,850 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 తగ్గి రూ.72,910 వద్దకు క్షీణించింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.67,300 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.490 దిగొచ్చి రూ.73,420 వద్దకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.

వెండి ధర
దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు భారీగా రూ.1200 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,01,000 వద్దకు దిగొచ్చింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement
 
Advertisement
 
Advertisement