కోల్‌కతా మే సవాల్‌ | Polling for 9 seats in Bengal on June 1 | Sakshi
Sakshi News home page

కోల్‌కతా మే సవాల్‌

May 29 2024 1:02 AM | Updated on May 29 2024 1:02 AM

Polling for 9 seats in Bengal on June 1

తృణమూల్‌ కోటపై కమలం గురి! 

బెంగాల్లో 9 స్థానాలకు జూన్‌ 1న పోలింగ్‌

పోలింగ్‌ జరిగే లోక్‌సభ స్థానాలు డమ్‌ డమ్, బారాసత్, బసీర్హాట్, జయనగర్, మథురాపూర్, డైమండ్‌ హార్బర్, జాదవ్‌పూర్, కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తర్‌  

పశ్చిమ బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. ఆరు విడతల్లో 33 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా 9 స్థానాల్లో జూన్‌ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్‌ జరగనుంది. వీటిలో చాలా సీట్లు కోల్‌కతా నగర పరిధిలో ఉన్నవే. ఇవన్నీ అధికార తృణమూల్‌ ఖాతాలోని స్థానాలే. ఈసారి వాటిపై కమలనాథులు కన్నేశారు. దాంతో బీజేపీ, తృణమూల్‌ మధ్య హోరాహోరీ సాగుతోంది. బెంగాల్లో ఇండియా కూటమికి మమత దూరంగా ఉండటంతో కాంగ్రెస్‌–సీపీఎం కలిసి పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సీట్లపై ఫోకస్‌... – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

డైమండ్‌ హార్బర్‌... అభిషేక్‌ హ్యాట్రిక్‌ గురి 
బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన డైమండ్‌ హార్బర్‌ పోర్టు యూరప్‌కు ముడి సరుకుల రవాణా హబ్‌గా వెలుగు వెలిగింది. ఈ నియోజవర్గంలో 2009లో తృణమూల్‌ జెండా పాతింది. గత రెండు ఎన్నికల్లోనూ మమత మేనల్లుడు అభిõÙక్‌ బెనర్జీ గెలిచారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. బీజేపీ ఇక్కడ గత ఎన్నికల్లో రెండో స్థానలో నిలిచినా పోయినసారి 4.7 లక్షల పైగా ఓట్లు దక్కించుకుంది. ఈసారి అభిజిత్‌ దాస్‌ (బాబీ)ను రంగంలోకి దించింది. సీపీఎం నుంచి ప్రతీకుర్‌ రెహా్మన్‌ పోటీలో ఉన్నారు.

కోల్‌కతా ఉత్తర్‌.. తృణమూల్‌ వర్సెస్‌ మాజీ 
తృణమూల్‌కు మరో కంచుకోట. 2009లో ఉనికిలోకి వచి్చంది. తృణమూల్‌ సీనియర్‌ నేత సుదీప్‌ బందోపాధ్యాయ్‌ హ్యాట్రిక్‌ కొట్టారు. ఈసారీ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి తృణమూల్‌ మాజీ నేత తపస్‌ రాయ్‌ పోటీ చేస్తున్నారు. తృణమూల్‌ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా ఉన్న ఆయన ఇటీవల తన ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన కొద్ది రోజులకే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం! లెఫ్ట్‌ మద్దతుతో కాంగ్రెస్‌ తరఫున ప్రదీప్‌ భట్టాచార్య బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. 20 శాతం పైగా ఉన్న ముస్లిం ఓటర్లు ఇక్కడ కీలకం.

జాదవ్‌పూర్‌... బరిలో బెంగాలీ నటి 
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. కోల్‌కతా పరిధిలోని ఈ స్థానంలో 2009 నుంచీ తృణమూల్‌ వరుస విజయాలు సాధిస్తోంది. సిట్టింగ్‌ ఎంపీ, ప్రముఖ నటి మిమి చక్రవర్తి ఇటీవలే తృణమూల్‌కు, లోక్‌సభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు. దాంతో ఈసారి మరో బెంగాలీ నటి, తృణమూల్‌ యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సయానీ ఘోష్‌కు దీదీ టికెటిచ్చారు. బీజేపీ నుంచి అనిర్బన్‌ గంగూలీ, సీపీఎం నుంచి శ్రీజన్‌ భట్టాచార్య బరిలో ఉన్నారు.

కోల్‌కతా దక్షిణ్‌... దీదీ అడ్డా 
ఇది మమత కంచుకోట. 1991, 1996ల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఆమె తర్వాత 2009 దాకా సొంత పార్టీ తృణమూల్‌ తరఫున నెగ్గారు. ఆమె సీఎం అయ్యాక కూడా ఇక్కడ తృణమూల్‌ జెండాయే ఎగురుతోంది. ఈసారి కూడా సిట్టింగ్‌ ఎంపీ మాలా రాయ్‌ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి దేబశ్రీ చౌదరి, సీపీఎం అభ్యరి్థగా సైరా షా హలీం రేసులో ఉన్నారు. పోటీ ప్రధానంగా తృణమూల్, బీజేపీ మధ్యే నెలకొంది.

జయనగర్‌... టఫ్‌ ఫైట్‌ 
అపార అటవీ సంపదకు నెలవైన ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం. సజ్నేఖాలీ పక్షుల సంరక్షణ కేంద్రం, సుందర్బన్‌ మాగ్రూవ్‌ నేషనల్‌ పార్క్‌ దీని పరిధిలోవే. 2004 దాకా ఆరెస్పీ కంచుకోట. 2014 నుంచి తృణమూల్‌ పాగా వేసింది. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ ప్రతిమా మండల్‌ హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచి్చన అశోక్‌ కందారీయే మళ్లీ బరిలో ఉన్నారు. 2019లో ఆయనకు 4.5 లక్షల ఓట్లు వచ్చాయి! కాంగ్రెస్‌ దన్నుతో సీపీఎం సమేంద్రనాథ్‌ మండల్‌ను పోటీలో నిలిపింది.

మథురాపూర్‌.. హోరాహోరీ 
ఈ కూడా ఎస్పీ రిజర్వుడ్‌ స్థానంలో కమ్యూనిస్టులదే ఆధిపత్యం. 94 శాతం మంది గ్రామీణ ప్రజలే. 30 శాతం మంది ఎస్సీ ఓటర్లు. 2009 తర్వాత ఇక్కడ తృణమూల్‌ జెండా పాతింది. ఆ పార్టీ నుంచి బపీ హల్దార్‌ పోటీలో ఉన్నారు. బీజేపీ అశోక్‌ పురకాయిత్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్‌ దన్నుతో సీపీఎం శరత్‌ చంద్ర హల్దర్‌ను పోటీలో నిలిపింది. దీంతో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement