'హరోం హర' ట్రైలర్‌ను విడుదల చేసిన మహేశ్‌ బాబు | Haromhara Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

'హరోం హర' ట్రైలర్‌ను విడుదల చేసిన మహేశ్‌ బాబు

Published Thu, May 30 2024 1:08 PM

Haromhara Official Trailer Out Now

సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా త్వరలో విడుదల  కానుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్‌ను మేకర్స్‌ ప్రకటించారు. జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. సుమంత్ జి .నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘హరోం హర’ ట్రైలర్‌ను తాజాగా టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు విడుదల చేశారు. ట్రైలర్‌ను చూస్తుంటే ఈసారి సుధీర్‌బాబు హిట్‌ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. ట్రైలర్‌ చూస్తున్నంత సేపు కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఇందులో భారీ యాక్షన్ సీన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సుధీర్‌ బాబు కూడా అందుకు తగ్గట్లు రిస్క్‌తో కూడుకున్న స్టంట్స్‌ చేసినట్లు కనిపిస్తుంది. ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలను సుధీర్‌ బాబు పెంచేశాడని చెప్పవచ్చు. జూన్‌ 14న ‘హరోం హర’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement