పాలస్తీనాకు మద్దతుగా పోస్ట్‌.. రోహిత్‌ శర్మ భార్యపై ట్రోల్స్‌ | Sakshi
Sakshi News home page

పాలస్తీనాకు మద్దతుగా పోస్ట్‌.. రోహిత్‌ శర్మ భార్యపై ట్రోల్స్‌

Published Wed, May 29 2024 3:12 PM

Team India Captain Rohit Sharma Wife Ritika Sajdeh Trolled For All Eyes On Rafah Story On Instagram

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భార్య రితిక సజ్దే సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా ట్రెండింగ్‌లో ఉన్న ఓ పోస్ట్‌ను షేర్‌ చేయడమే ఇందుకు కారణం.

వివరాల్లోకి వెళితే.. హమాస్‌ (పాలస్తీనాలో అధికారిక పార్టీ) నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ సైన్యం బాంబు దాడులు జరుపుతుంది. ఈ దాడుల్లో 37 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 

ఈ దాడుల అనంతరం రఫా నగరం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. విశ్వవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు రఫా నగరాన్ని హైలైట్‌ చేస్తూ పాలస్తీనాపై సానుభూతి చూపిస్తున్నారు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భార్య రితిక కూడా పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా' అనే ట్రెండింగ్‌లో ఉన్న ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది.

రితిక ఈ పోస్ట్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. భారత్‌లో ఎన్ని అరాచకాలు జరిగినా స్పందించని రితిక పరాయి దేశంలోని సమస్యపై స్పందించడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

కశ్మీరీ పండిట్లపై దాడులు, మణిపూర్‌లో హింస, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఈమె ప్రశ్నించలేదే అని నిలదీస్తున్నారు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో, భారత్‌కు ఏమాత్రం సంబంధం లేని అంశంపై రితక స్పందించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. 

ఇంటి సమస్యలు (భారత్‌లో జరిగేవి) పట్టవు కాని పరాయి దేశ సమస్యలపై గళం విప్పడం ఫ్యాషన్‌ అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. రఫా పోస్ట్‌పై నెట్టింట తీవ్ర వ్యతిరేత ఎదురవడంతో రితిక ఈ పోస్ట్‌ను వెంటనే డిలీట్‌ చేసి సైలెంట్‌ అయిపోయింది.

ఇదిలా ఉంటే, రితిక కంటే ముందు చాలామంది భారతీయ సెలబ్రిటీలు పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా' అనే పోస్ట్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ లిస్ట్‌లో కరీనా కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, త్రిప్తి దిమ్రీ, సమంత రూత్‌ ప్రభు, ఫాతిమా సనా షేక్, స్వరా భాస్కర్, దియా మీర్జా లాంటి బాలీవుడ్‌ ప్రముఖులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement