దూసుకుపోతున్న రిషబ్‌ పంత్‌ | RISHABH PANT MOVE TO NUMBER 6 IN ICC TEST BATTING RANKINGS | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న రిషబ్‌ పంత్‌

Jul 2 2025 4:16 PM | Updated on Jul 2 2025 4:23 PM

RISHABH PANT MOVE TO NUMBER 6 IN ICC TEST BATTING RANKINGS

టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ దూసుకుపోతున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగుపర్చుకొని ఆరో ప్లేస్‌కు ఎగబాకాడు. లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ట్విన్‌ సెంచరీస్‌ (రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు) చేసిన పంత్‌.. గత వారం ర్యాంకింగ్స్‌లోనే ఓ ర్యాంక్‌ మెరుగుపర్చుకున్నాడు. తాజాగా మరో ర్యాంక్‌ మెరుగుపర్చుకొని తన కెరీర్‌ అత్యుత్తమ ఐదో ర్యాంక్‌కు అ‍్యతంత చేరువయ్యాడు.

గత వారం ర్యాంకింగ్స్‌ అనంతరం పంత్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో 800 రేటింగ్‌ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ 800 రేటింగ్‌ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు. ప్రస్తుతం పంత్‌ 801 రేటింగ్‌ పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాడు.

ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో పంత్‌ ఇదే జోరును కొనసాగిస్తే.. త్వరలోనే నంబర్‌ వన్‌ టెస్ట్‌ బ్యాటర్‌ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టాప్‌ ర్యాంక్‌లో ఉన్న జో రూట్‌కు పంత్‌కు 88 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం ఉంది. పంత్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ స్టీవ్‌ స్మిత్‌. స్మిత్‌ తాజా ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌, టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు.

ఈ వారం​ ర్యాంకింగ్స్‌లో పంత్‌తో పాటు మరిన్ని చెప్పుకోదగ్గ​ మార్పులు జరిగాయి. ఆసీస్‌ ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌ 3, శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక 14, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్‌ 11, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ 17, మరో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ 15, వెస్టిండీస్‌ ప్లేయర్‌ జస్టిన్‌ గ్రీవ్స్‌ 15 స్థానాలు మెరుగుపర్చుకొని 10, 17, 53, 56, 59, 86 స్థానాలకు ఎగబాకారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా, రబాడ, కమిన్స్‌ టాప్‌-3లో కొనసాగుతుండగా.. విండీస్‌ పేసర్‌ షమార్‌ జోసఫ్‌ 14, ముల్దర్‌ 6, కార్బిన్‌ బాష్‌ 45, చివంగ 35 స్థానాలు మెరుగుపర్చుకొని 36, 52, 57, 88 స్థానాలకు ఎగబాకారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. రవీంద్ర జడేజా, మెహిది హసన్‌, జన్సెన్‌ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement