సక్సెస్‌కి ఏజ్‌తో సంబంధం లేదంటే ఇదేనేమో..! ఏకంగా ఫిడే చెస్‌.. | Sakshi
Sakshi News home page

ఫిడే చెస్‌ రేటింగ్‌ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్‌ జియానా గర్గ్‌..!

Published Thu, May 30 2024 12:51 PM

Youngest Chess Champion To Receive A FIDE Chess Rating Jiaana Garg

చెస్‌ స్టార్‌ జియానా గార్గ్ అతి పిన్న వయస్కురాలైన చెస్‌ ఛాంపియన్‌. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ఫిడే(ప్రపంచ చెస్‌ సమాఖ్య) రేటింగ్‌ పొంది అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు అత్యంత చిన్న వయసులో ఈ రేటింగ్‌ పొందిన చిన్నారిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్ల వయసులో అత్యున్నత అంతర్జాతీయ ప్రపంచ చెస్‌ సమాఖ్య రేటింగ్‌ని పొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అమె చెస్‌ జర్నీ ఎలా సాగిందంటే..

జియానా గార్గ్ సాధించిన ఫిడే చెస్‌ రెటింగ్‌ నిజంగా అసాధారణమైనది. అత్యధిక ఫీడే చెస్‌ రేటింగ్‌ సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు ఆమె. ఈ విజయాన్ని చూస్తే జియానాకు చదరంగం పట్ల ఉన్న ఇష్టం, అంకితభావం క్లియర్‌గా తెలుస్తోంది. ఆమె చెస్‌ నేర్చుకోవడం ప్రారంభించింది కేవలం నాలుగున్నరేళ్ల నుంచే..చాలా వేగంగా ఈ క్రీడలో అపార జ్ఞానాన్ని సంపాదించింది. ఈ విజయంలో జియాని గురువు నవీన్‌ బన్సాల్‌  పాత్ర ఎక్కువే ఉంది. చండీగఢ్‌ చెస్‌ అసోసీయేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన నవీన్‌ బన్సాల్‌ మొదట్లో ఇంత చిన్న వయసులో ఉన్న ఆ చిన్నారికి చెస్‌ నేర్పించడానికి చాలా సంకోచించాడు. 

ఎందుకంటే..?ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులకు చెస్‌ ఎట్టిపరిస్థితుల్లో నేర్పించరు. అందువల్ల ఆయన ముందుకు రాలేకపోయినా..జియానాలో ఉన్న ప్రతిభ  ఆయన్ను ఆకర్షించింది. ఆమెకు చెస్‌ మెళుకువలు నేర్పించేలా చేసింది. అదీగాక జియానా అమ్మ కూడా తన కూతురు క్రమశిక్షణతో ఉంటుందని ఒప్పించేలా ఒక వీడియో కూడా తనకు పంపినట్లు తెలిపారు. ఐతే ఆమె కొన్ని నెలల శిక్షణలోనే చెస్అ‌ డ్వాన్స్‌డ్‌ బ్యాచ్‌లో పదోన్నతి పొందింది. 

"తను నా ఉపన్యాసాలను వినేలా అత్యంత అధునాతన బ్యాచ్‌లో ఉంచి మరీ కోచింగ్‌ ఇప్పించాం. ఐతే ఆమె అనుహ్యంగా మంచి రేటింగ్‌ ఉన్న ఇతర పిల్లలతో సమానంగా పోటీ పడటం ప్రారంభించిదని గుర్తించి, ఆమెకు చక్కటి తర్ఫీదు ఇచ్చామని చెప్పారు". బన్సాలీ. ఆమె ఇంతలా చెస్‌పై అంకితభావంతో నేర్చుకునేలా దృష్టిసారించడంలో జియానా తల్లి​ పాత్ర అద్భుతమైనదని అన్నారు. తల్లిదండ్రులు సహకారం లేకుండా ఏ కోచ్‌ కూడా ఇంత చిన్న వయసులోనే చెస్‌ ఛాంపియన్లుగా తీర్చిదిద్దలేరని అన్నారు.

జియానా చెస్‌ విజయాలు..
జియానా గార్గ్‌ మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ 2024, నేషనల్ అండర్-11 గర్ల్స్ చెస్ ఛాంపియన్‌షిప్-2023, మొదటి మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2023, మొదటి లేట్ శ్రీ ధీరాజ్ సింగ్ మెమోర్ ఓపెన్ రఘువానిడే,  రేటింగ్ టోర్నమెంట్ 2023 వంటి అనేక టోర్నమెంట్‌లలో పాల్గొంది. 

ఆమె తను గురువుల మార్గదర్శకత్వంలో చేసిన అచంచలమైన కృషి, అంకితభావాలకి నిదర్శనమే ఈ విజయాల పరంపర. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చదరంగా ఔత్సాహికులకు స్పూర్తిగా నిలిచింది. పైగా ఈ పురాతన చెస్‌ క్రీడలో రాణించడానికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని ప్రూవ్‌ చేసింది.

(చదవండి: 'రజనీకాంత్‌ స్టైల్‌ దోసలు': చూస్తూనే ఉండిపోతారు..!)

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement