కల్కి రన్‌ టైమ్‌ ఫిక్స్‌.. భారీ బడ్జెట్‌పై ప్రభాస్‌ కామెంట్‌ | Kalki 2898 AD Movie Runtime Fix | Sakshi
Sakshi News home page

కల్కి రన్‌ టైమ్‌ ఫిక్స్‌.. భారీ బడ్జెట్‌పై ప్రభాస్‌ కామెంట్‌

Published Thu, May 30 2024 2:33 PM

Kalki 2898 AD Movie Runtime Fix

ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్  అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్‌ బచ్చన్ , కమల్‌ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్  27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నారు. ఇందులో బుజ్జి వాహనం చాలా ప్రత్యేకంగా ఉండనుంది. అయితే, కల్కి సినిమా రన్‌ టైమ్‌ గురించి నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది.

కల్కి సినిమా విడుదలకు కేవలం 4 వారాల సమయం మాత్రమే ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రన్ టైమ్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. సుమారు 3గంటల 10నిమిషాల పాటు కల్కి సినిమా రన్‌ టైమ్‌ ఉందట. అయితే, ప్రస్తుతం ఆ చిత్ర మేకర్స్‌ నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఖచ్చింతంగా 3గంటలకు మాత్రం తగ్గకుండానే కల్కి రన్‌ టైమ్‌ ఉంటుందని సమాచారం.

తాజాగా కల్కి  ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్‌ పలు విషయాలు పంచుకున్నాడు. కల్కి సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయంగా ఉన్న వారిని కూడా టార్గెట్‌ చేస్తూ తెరికెక్కించినట్లు ప్రభాస్‌ తెలిపారు. ఈ క్రమంలో బడ్జెట్‌ కూడా భారీగా పెరిగిందని ఆయన అన్నారు. గ్లోబల్‌ రేంజ్‌లో సినిమా ఉండటం వల్ల కల్కిలోని పాత్రల పేర్లు కూడా కాస్త ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు. దేశంలోని గొప్ప నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారని ఆయన అన్నారు. తనను అందరూ పాన్‌ ఇండియా స్టార్‌ అని పిలవడం తనపై ఎలాంటి ఒత్తిడి కలిగించదన్నారు. తనను అలా పిలవడాన్ని ఫ్యాన్స్‌ కూడా ఇష్టపడతారని ప్రభాస్‌ తెలిపారు.

కల్కి సినిమా చూశాక  మరో ప్రపంచంలోకి వెళ్లి వచ్చామనే భావనలో ప్రేక్షకులు ఉంటారని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌  అన్నారు. అవతార్‌ సినిమా చూసిన తర్వాత తాను కూడా అలాంటి అనుభూతే పొందినట్లు ఆయన తెలిపారు. కల్కి చూసినవారందరూ కూడా ఇలాగే ఫీల్‌ అవుతారని ఆయన పేర్కొన్నారు.  తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‌తో పాటు పలు విదేశీ భాషల్లో కూడా కల్కి చిత్రం విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement