తెలంగాణ చరిత్రను చెరిపేయడమే | Sakshi
Sakshi News home page

తెలంగాణ చరిత్రను చెరిపేయడమే

Published Wed, May 29 2024 4:53 AM

KTR Fires on Congress Government: Telangana

కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ఫైర్‌

అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ తొలగింపు సరికాదు

ఇది నాలుగు కోట్ల తెలంగాణ గుండెలను గాయపరచడమే

ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై ప్రజా ఉద్యమం తప్పదు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అధికారిక చిహ్నం, అధికారిక గీతం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. రాచరికపు గుర్తుల పేరిట తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగింపు సరికాదన్నారు. అవి వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు అని అభివర్ణించారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటి తొలగింపు తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనని పేర్కొన్నారు. మంగళవారం ‘ఎక్స్‌’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు.

ఒకపక్క రాష్ట్ర గేయంగా ఎంపిక చేసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్‌ అని కీర్తిస్తూనే అధికారిక చిహ్నంలో వాటిని తొలగించి అవమానిస్తారా అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్‌ విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్‌కు ప్రతీక అని, కాకతీయ కళాతోరణం సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ ఉన్న రాచరికపు గుర్తులను తొలగిస్తారా అని ప్రశ్నించారు. భారత జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్తూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయని, జాతీయ పతాకంలో దశాబ్దాలుగా ధర్మచక్రం ఉందని వివరించారు. 

రువులు పూడ్చేస్తారా? అసెంబ్లీని కూల్చేస్తారా?
తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏముందో తెలుసా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాక తీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చే స్తారా? రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీనీ కూల్చేస్తారా అని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్న రేవంత్‌ ప్రభుత్వం రేపు తెలంగాణ సరిహద్దులను కూడా చెరిపేస్తుందా? అని అన్నారు. గత పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నానికి యావత్‌ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉందని గుర్తు చేశారు. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించేది లేదన్నారు.  

కనీసం విత్తనాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని కేటీఆర్‌ విమర్శించారు.  కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో రైతులపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్‌ ఇతర రాష్ట్రాల్లో ఎన్ని కల ప్రచారం, ఢిల్లీ పర్యటనలతో బిజీగా ఉండటం సిగ్గుచేటని అన్నారు. ఆదిలాబాద్‌ లో రైతులపై జరి గిన లాఠీచార్జి ఘటనకు ప్రభుత్వం వెంటనే క్షమా పణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులపై లాఠీలతో దాడులకు పాల్పడితే సహించేది లేదని, పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement