Major Radhika Sen: కాంగోలో శాంతిదూత | Sakshi
Sakshi News home page

Major Radhika Sen: కాంగోలో శాంతిదూత

Published Thu, May 30 2024 6:24 AM

Indian Peacekeeper Major Radhika Sen Receives UN Military Gender Advocate Of The Year Honor

భారత ఆర్మీకి చెందిన మేజర్‌ రాధికా సేన్‌కు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరానికి గాను ‘మిలటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రకటించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డు కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస చోటు చేసుకోకుండా రాధికా సేన్‌ చూపిన శాంతి ప్రబోధానికి, ప్రచారానికి నిదర్శనం. రాధికాసేన్‌ పరిచయం.

తు΄ాకీ పట్టుకొని శాంతి కోసం ప్రయత్నించడం జటిలమైన పని. అంతర్యుధ్ధం జరిగే దేశాల్లో బయటి దేశాల నుంచి వెళ్లి ఈ పని చేయాలంటే ్ర΄ాణాలతో చెలగాటం. కాని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌ ఆయా దేశాలలో శాంతి కోసం ΄ోరాటం చేస్తూనే ఉంటుంది. ్ర΄ాణాలకు తెగిస్తూనే ఉంటుంది. అందుకే ఈ శాంతి దళాలలో గొప్పగా పని చేసిన వారికి ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలలో అవార్డులు ఇస్తుంటుంది. లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పని చేసే వారికి  ‘మిలటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఇస్తోంది. 2023 సంవత్సరానికి ఆ అవార్డు మన ఆర్మీ మేజర్‌ రాధికా సేన్‌కు దక్కింది.

ఈ కాంగోలో ఘోరాలు
మధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో’ (ఆర్‌ఓసి), రెండు ‘డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో’ (డిఆర్‌సి). ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద దేశం డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో. ఒకప్పుడు బెల్జియం వలసగా ఉన్న ఈ దేశం  స్వతంత్రం ΄÷ంది ‘మొబుతు’ అనే నియంత ΄ాలనలో మగ్గింది. అతణ్ణి ప్రజలు కిందకు దించాక 1998 నుంచి అక్కడ అస్థిర ΄ాలన కొనసాగుతూ ఉంది. తరచూ అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ తూర్పు ్ర΄ాంతాలైన ఇటురి, నార్త్‌ కీవోలలో రెండు సాయుధ దళాల వల్ల దాడులు జరుగుతున్నాయి. ‘ఎయిడెడ్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌’ అనే గ్రూప్, ‘హుతూస్‌’ అనే మరో గ్రూప్‌ తమ తమ కారణాల రీత్యా తీవ్ర హింసకు ΄ాల్పడుతుంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య సామాన్య జనం నలుగుతున్నారు. వీరిని అదుపు చేయడానికి వచ్చే సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు ΄ాల్పడుతోంది. వీటన్నింటి మధ్య కనీస ఓదార్పుగా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు పని చేస్తున్నాయి.

అత్యాచార పర్వం
రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, బాలికలు ఏదో ఒక మేర హింసకు, లైంగిక హింసకు లోనయ్యారు. అర్ధరాత్రి అపరాత్రి ప్రత్యర్థి గ్రూపులు దాడి చేసి స్త్రీలు, బాలికల మీద అత్యాచారాలు చేసి మగవారిని చంపేసి ΄ోతారు. ఇవి అక్కడ స్త్రీల మీద తీవ్రమైన మానసిక ప్రభావాన్ని ఏర్పరుస్తున్నాయి. అత్యాచారాల వల్ల వారిలో చాలామంది హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌ బారిన పడుతున్నారు. అక్కడి చిన్నపిల్లలైతే దారుణమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. ΄ûష్టికాహారం ఊసే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాధిత స్త్రీలలో విశ్వాసం నింపుతూ వారి కోసం సమర్థంగా పని చేయడం వల్ల రాధికా సేన్‌ను అవార్డు వరించింది.

బాధితుల కోసం దూతగా వచ్చి...
ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్‌ రాధికా సేన్‌ 2023 ఏప్రిల్‌లో డి.ఆర్‌.కాంగోకు వెళ్లింది రాధికా సేన్‌. ‘ఇండియన్‌ రాపిడ్‌ డి΄్లాయ్‌మెంట్‌ బెటాలియన్‌’కు ఆమె అక్కడ కమాండర్‌గా పని చేసింది. అక్కడ మొదటగా ఆమె చేసిన పని తన బెటాలియన్‌కు కాంగో సంస్కృతిని పరిచయం చేయడం. స్త్రీల పట్ల సుహృద్భావనతో ఎలా మెలగాలో తెలియచేయడం. వారిలో ఆత్మవిశ్వాసం ఎలా కలిగించాలో చెప్పడం. రాధికా సేన్‌ నార్త్‌ కీవోలో పని చేసింది. 

అక్కడ స్త్రీల కోసం హెల్త్‌ ఎడ్యుకేషన్, ఉ΄ాధి, లింగ సమానత్వం, కుటుంబ నిర్ణయాల్లో స్త్రీ ్ర΄ాధాన్యం వంటి అంశాలలో రాధికా సేన్‌ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. భర్తలను, పిల్లలను కోల్పోయిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపేలా వారితో తరచూ ఆమె సంభాషణలు నిర్వహించేది. వారు మళ్లీ పనిలో పడేలా చూసింది. హింసను సమష్టిగా ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించింది. కాంగో మహిళలు రాధికా సేన్‌ను తమలోని మనిషిగా చూశారు. ఆమె ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ రాధికా సేన్‌కు అవార్డు ప్రకటిస్తూ ‘రాధికా సేన్‌ కాంగో మహిళలను గొంతెత్తేలా చేయగలిగింది. శాంతి కోసం వారు ముందుకొచ్చేలా ఉద్యుక్తుల్ని చేసింది’ అని మెచ్చుకున్నారు. మే 30 (నేడు) రాధికా సేన్‌కు అవార్డు బహూకరించనున్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement