దేవుడైతే గుడి కడతాం... ప్రధానిపై ‘దీదీ’ సెటైర్లు | Mamata Banerjee Satirical Comments On PM Modi Sent By God Remarks, More Details Inside | Sakshi
Sakshi News home page

దేవుడైతే గుడి కడతాం... ప్రధానిపై ‘దీదీ’ సెటైర్లు

Published Wed, May 29 2024 4:24 PM

Mamata Banerjee Satires On Pm Modi Sent By God Remarks

కోల్‌కతా: చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, వెస్ట్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. తనను దేవుడు పంపాడని ప్రధాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై చురకలంటించారు. ‘ఒకరేమో దేవుళ్లకే దేవుడినని అంటారు. మరో నేతేమో పూరి జగన్నాథుడే ఆయన భక్తుడంటారు.

దేవుడయితే మేం ఆయనకు గుడి కడతాం. పూలు,పండ్లు, స్వీట్లు, ప్రసాదం పెడతాం. ఆయన కావాలనుంటే గుజరాతీ వంటకం ఢోక్లా కూడా పెడతాం’అని మమత ఎద్దేవా చేశారు. దేవుడైతే రాజకీయాల్లో ఉండకూడదని, అల్లర్లు రెచ్చగొట్టొద్దని సూచించారు. 

కాగా, ప్రధాని మోదీ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా అమ్మ బతికున్నంతవరకు నేను అందరిలాగే పుట్టాననుకున్నాను. కానీ ఆమె చనిపోయిన తర్వాత నన్ను దేవుడు పంపించాడేమో అనిపిస్తోంది. 

ఈ శక్తి నాకు శరీరం నుంచి రావడం లేదు. దేవుడిస్తున్నాడు. నేననేది ఏమీ లేదు. నేను దేవుని సాధానాన్ని మాత్రమే’అని ప్రధాని ఇంటర్వ్యూలో చెప్పడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement