కోడ్‌ ఉల్లంఘనే | Sakshi
Sakshi News home page

కోడ్‌ ఉల్లంఘనే

Published Thu, May 30 2024 5:10 AM

Congress claims PM Narendra Modi 48-hr meditation trip

మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోండి:  కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన 48 గంటల ధ్యానంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏడో విడత పోలింగ్‌ ముందు ప్రధానమంత్రి ధ్యానం చేయడం ముమ్మాటికీ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. 

తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌ ధ్యాన మండపంలో గురువారం నుంచి రెండు రోజులపాటు మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీవీ మీడియాలో ప్రసారం చేయకుండా, ప్రింట్‌ మీడియాలో ప్రచురించకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ నేతలు రణదీప్‌ సూర్జేవాలా, అభిõÙక్‌ సింఘ్వీ, సయీద్‌ నజీర్‌ హుస్సేన్‌ విజ్ఞప్తి చేశారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement