కజ్‌రారే సాంగ్‌.. లైవ్‌లో డ్యాన్స్‌ మర్చిపోలేనన్న అమితాబ్‌.. | Sakshi
Sakshi News home page

కజ్‌రారే.. కజ్‌రారే.. సాంగ్‌లో ఐశ్వర్య కూడా ఉంది.. మర్చిపోయారా బిగ్‌బీ?

Published Thu, May 30 2024 2:32 PM

Amitabh Bachchan Recalls Having Fun with Abhishek Bachchan During Kajra Re Song

కొన్ని పాటలు ఎవర్‌గ్రీన్‌.. ఎప్పుడు విన్నా ఎక్కడలేని ఉత్తేజం వస్తుంది. అలాంటి పాటే కజ్‌రారే.. కజ్‌రారే..! 2005లో వచ్చిన బంటీ ఔర్‌ బబ్లీ మూవీలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ఇది. అప్పట్లో ఈ సాంగ్‌ ఓ రేంజ్‌లో మార్మోగిపోయింది. అందులో అమితాబ్‌ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్య రాయ్‌ నటించారు. అయితే ఈ పాట రిలీజయ్యే సమయానికి వారికింకా పెళ్లి కాలేదు.. అది వేరే విషయం!

ఎంతో పాపులర్‌..
బంటీ ఔర్‌ బబ్లీ సినిమా రిలీజై 19 ఏళ్లు అయిన సందర్భంగా బిగ్‌బీ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. ఓ అభిమాని కజ్‌రారే సాంగ్‌ ఫోటోను షేర్‌ చేయగా దానిపై అమితాబ్‌ స్పందిస్తూ.. ఆ పాట ఎంత పాపులర్‌ అయిందో! ఇప్పటికీ ఆ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. మర్చిపోలేని విషయం ఏంటంటే.. భయ్యూ(అభిషేక్‌)తో కలిసి స్టేజీపై ఈ పాటకు లైవ్‌లో డ్యాన్స్‌ చేశాను అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. 

ఐశ్వర్య పేరు ప్రస్తావించాల్సింది!
కాగా 2006 జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో అమితాబ్‌, అభిషేక్‌తో పాటు ఐశ్వర్య రాయ్‌.. స్టేజీపై కజ్‌రారే పాటకు డ్యాన్స్‌ చేశారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్న బిగ్‌బీ.. ఐశ్వర్య పేరు కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు మీరు, మీ కుమారుడు ఈ పాటకు అవసరం కూడా లేదు. ఐశ్వర్య లేకపోతే ఎవరూ చూసేవారు కూడా కాదు, అలాంటిది తననే మర్చిపోయారా? అని విమర్శిస్తున్నారు. 

సీక్వెల్‌..
బంటీ ఔర్‌ బబ్లీ విషయానికి వస్తే యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ఈ సినిమాలో అభిషేక్‌ హీరోగా రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి 2022లో సీక్వెల్‌ కూడా వచ్చింది. ఇందులో అభిషేక్‌కు బదులుగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటించాడు. అలాగే రాణీ ముఖర్జీ, సిద్దాంత్‌ చతుర్వేది, శర్వారి వాఘ్‌, పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్‌ కాలేకపోయింది.

 

 

చదవండి: ఓటీటీలో మలయాళ హిట్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement